Advertisementt

రాజమౌళికి అమీర్ ఖాన్ ఝలక్..!

Mon 18th Dec 2017 10:00 PM
aamir khan,mahabharat,rajamouli,jhalak  రాజమౌళికి అమీర్ ఖాన్ ఝలక్..!
Aamir Khans Shocks SS Rajamouli రాజమౌళికి అమీర్ ఖాన్ ఝలక్..!
Advertisement
Ads by CJ

బాహుబలి వంటి కళాఖండాన్ని తీర్చిదిద్ది ప్రపంచ వ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి పేరు ఇటు ఇండియాలో  అయితే మారుమోగిపోయింది. బాహుబలి తర్వాత రాజమౌళి దర్శకత్వంలో నటించడానికి పలువురు హీరోలు పోటీ పడుతుండగా....  బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ మాత్రం రాజమౌళికి షాక్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. ఇంతకీ అమీర్ ఖాన్ జక్కన్నకి షాక్ ఇవ్వడమేమిటా అని ఆలోచిస్తున్నారు..? ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. రాజమౌళికి ఈగ సినిమా చేసే సమయంలోనే  అమీర్ ఖాన్ తో సినిమా చేయాలని పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశాడనే టాక్ ఉంది. అయితే ఆ ప్రయత్నాలేమీ వర్క్ అవుట్ అవ్వలేదు.  ఆ తర్వాత బాహుబలి వంటి భారీ ప్రాజెక్ట్ తో బాలీవుడ్ ని షేక్ చేసేసిన రాజమౌళిని చూస్తే బాలీవుడ్ ఖాన్స్ త్రయం కూడా జడిసిపోయింది.

అయితే అప్పుడు బాహుబలి బాలీవుడ్ బాక్సాఫీసుని షేక్ చేస్తుంటే.. ఎటువంటి మాటలు మట్లాడని అమీర్ ఖాన్ ఇప్పుడు రాజమౌళికి ఒక షాక్ ఇస్తున్నాడు. ఇంతకీ అసలు విషమేమిటంటే.. మహాభారతం ప్రాజెక్ట్ ని భారీ ఎత్తున ఒక రేంజ్ లో తెరకెక్కించాలి అనేది రాజమౌళి కల. అదే విషయాన్ని రాజమౌళి చాలా సార్లు చాలా ఇంటర్వ్యూ స్ లో చెప్పాడు. అదే విషయాన్ని రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కూడా ధ్రువీకరించిన విషయం కూడా తెలిసిందే. కానీ ఆ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుందో అనేది మాత్రం అస్సలు క్లారిటీ లేదు.

కానీ ఇప్పుడు తాజాగా బాలీవుడ్ టాప్ హీరో అమీర్ ఖాన్ మాత్రం మహాభారతంని బిగ్ స్క్రీన్ పై తెరకెక్కించడానికి అన్ని సిద్ధం చేస్తున్నాడనే టాక్ వినబడుతుంది. అచ్చం రాజమౌళి ఆలోచించినట్లుగానే.....మహాభారతంని ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 6 పార్ట్ లుగా చిత్రీకరించాలని భావిస్తున్నాడు అమీర్ ఖాన్. మరి అమీర్ ఆలోచన నిజంగా రాజమౌళిని షాక్ కి గురి చేసే వార్తే అని చెప్పాలి. మరి అమీర్ ఖాన్ ఈ మహాభారతాన్ని రాజమౌళి దర్శకత్వంలో మాత్రం చేయాలనుకోవడం లేదు. వేరొకరి దర్శకత్వంలో అమీర్ ఈ మహాభారతాన్ని తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది.

Aamir Khans Shocks SS Rajamouli:

Aamir Khan Mahabharat Jhalak to Rajamouli

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ