Advertisementt

అత్తారింటికి దారేది చూస్తున్నట్టే వుంది..!

Mon 18th Dec 2017 12:50 PM
agnathavasi,attarintiki daaredi,trivikram srinivas,pawan kalyan,same to same  అత్తారింటికి దారేది చూస్తున్నట్టే వుంది..!
Agnathavasi Movie Teaser Talk అత్తారింటికి దారేది చూస్తున్నట్టే వుంది..!
Advertisement
Ads by CJ

గతంలో అంటే నాలుగేళ్ల క్రితం త్రివిక్రమ్ - పవన్ కళ్యాణ్ కలయికలో వచ్చిన అత్తారింటికి దారేది సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికి తెలిసిందే. ఆ సినిమాతో అటు త్రివిక్రమ్, ఇటు పవన్ లు ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. ఆ సినిమా కేవలం పవన్ కళ్యాణ్, సీనియర్ నటి నదియాల మీదే నడిచింది. అలాగే కామెడీ కూడా ఆ సినిమాలో బాగా హైలెట్ అయ్యింది. అయితే ఇప్పుడు త్రివిక్రమ్, పవన్ కలయికలో తెరకెక్కిన అజ్ఞాతవాసి కూడా సేమ్ టు సేమ్ అత్తారింటికి దారేదిని తలపిస్తుందంటూ సోషల్ ఇండియాలో ఒకటే కామెంట్స్ పడుతున్నాయి.

శనివారం విడుదలైన అజ్ఞాతవాసి టీజర్ చూసిన తర్వాత.. ఈసినిమా అత్తారింటికి దారేది సినిమాతో పోలిక ఉండటంతో కామెంట్స్ చెయ్యడమే కాదు.... అందులోని సీన్స్ ని.. అజ్ఞాతవాసి సినిమాలోని సీన్స్ ని కంపేర్ చేస్తూ సోషల్ మీడియాని హోరెత్తిస్తున్నారు. అందులోను అజ్ఞాతవాసిలో పవన్ కళ్యాణ్ లుక్ దగ్గరనుండి పేస్ ఎక్సప్రెషన్స్ వరకు అన్ని అంటే అన్ని అత్తారింటికి దారేది సినిమాని తలపిస్తున్నాయంటున్నారు. అత్తారింటికి దారేది లో ఎంతో పాపులర్ అయిన 'దేవ దేవం భజే..' అనే కూచిపూడి నృత్యాన్ని.. అజ్ఞాతవాసిలో కూడా అలాంటి కూచిపూడి నృత్యం ఉండడం, అజ్ఞాతవాసి యాక్షన్ సీక్వెన్స్ కూడా అత్తారింటికి దారేది యాక్షన్ సీక్వెన్స్ తలపిస్తుంది. 

హీరోయిన్స్ తో రొమాన్స్ నుండి అన్ని అత్తారింటికి దారేది ని తలపించడంతో నెటిజెన్లు అత్తారింటికి దారేది 2  గా అజ్ఞాతవాసిని అభివర్ణిస్తున్నారు. చూద్దాం ఈ సినిమా ఎంతమేర అత్తారింటిని పోలి ఉందో అనేది జనవరి 10 న క్లారిటీ వస్తుంది. ఎందుకంటే అజ్ఞాతవాసి సినిమా జనవరి 10 సంక్రాతి కానుకగా విడుదల కాబోతుంది.

Agnathavasi Movie Teaser Talk:

Agnathavasi Same to Same to Attarintiki Daaredi Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ