గత కొన్నేళ్లుగా తెలుగు సినిమాకి ఓవర్సీస్ మార్కెట్ బాగా పెరిగింది. ముఖ్యంగా యూఎస్ లో తెలుగు సినిమా కొనటానికి బయ్యర్లు తెగ ఉత్సహం చూపిస్తూ ఉన్నారు. అయితే కొన్ని సినిమాలు ఇక్కడ ఆడకపోయినా అక్కడ ఇరగతీశాయి. అయితే ఈ మధ్యకాలంలో అక్కడ సినిమాలు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. ముఖ్యంగా పెద్ద సినిమాలు బయ్యర్లు పైన బాగా ఎఫెక్ట్ చూపాయి.
అయితే ఈ నేపథ్యంలో క్రిస్మస్ వీకెండ్ లో రాబోయే రెండు సినిమాలు ఎలాంటి ఫలితాన్నందిస్తాయో అని అక్కడ కంగారు మొదలైంది. నాని నటించిన ఎంసీఏ, అఖిల్ నటించిన హలో సినిమాలు యూఎస్ లో సందడి చేయనున్నాయి. నానికి యూఎస్ లో మంచి మార్కెట్ వున్నా.. ఈ సినిమా ట్రైలర్ చూస్తే అంతగా అక్కడి వాళ్లు ప్రిఫర్ చేయకపోవచ్చు. విక్రమ్ కే కుమార్ డైరెక్ట్ చేసిన హలో సినిమా ట్రైలర్ యాక్షన్ ప్రధానంగా కనిపించడం.. అఖిల్ కు మార్కెట్ లేకపోవడంతో అక్కడ జనాలపై అంతగా ప్రభావం చూపవేమో అని అంటున్నారు.
ఈ రెండు సినిమాలకి తోడు బాలీవుడ్ కండల వీరుడు క్రిస్మస్ వీకెండ్లో సల్మాన్ ఖాన్ సినిమా ‘టైగర్ జిందా హై’ రిలీజవుతోంది. ఈ సినిమా యుఎస్ లో భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా రెండు సినిమాలపై కచ్చితంగా ప్రభావము చూపే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో ‘ఎంసీఏ’, ‘హలో’ యుఎస్ లో ఎలా పెర్ఫామ్ చేస్తాయో అన్నకంగారు కనిపిస్తోంది.