ఈ ఏడాది అంటే 2017 లో మెగాహీరోల సందడి ఎలా ఉన్నా 2018 లో మాత్రం మెగా హీరోల సందడి మాములుగా ఉండదు. చిరంజీవి దగ్గరనుండి పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, తాజాగా చిరు అల్లుడు కళ్యాణ్, నాగబాబు కూతురు నిహారిక ఇలా మెగా ఫ్యామిలీ సందడి ఒక రేంజ్ లో 2018 లో ఉండబోతోంది. ఇక ఇప్పుడు ఈ ఏడాది అప్పుడే పూర్తికావొచ్చింది. అల్లు శిరీష్ ఒక్క క్షణం సినిమా విడుదలతో ఈ ఏడాదికి ముగింపు పలకబోతోంది. ఇక వచ్చే ఏడాది జనవరిలోనే పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అజ్ఞాతవాసితో 2019 కి బోణి కొట్టబోతున్న మెగా ఫ్యామిలీ హీరోల బిజినెస్ వివరాలు చూస్తుంటే ట్రేడ్ వర్గాలు సైతం బిత్తరబోతున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి సై రా మూవీ:
చిరంజీవి... రామ్ చరణ్ నిర్మాతగా... సురేందర్ దర్శకత్వంలో సై రా నరసింహ రెడ్డి చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా దేశంలోని పలు భాషల్లో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా భారీ బడ్జెట్ అంటే దాదాపుగా 150 కోట్లపైమేర ఖర్చు పెడుతున్నట్టుగా వినికిడి. అలాగే 150 కోట్ల దగ్గరే బడ్జెట్ ని ఎండ్ చెయ్యకుండా ఇంకా ఎక్కువైనా పర్లేదు గాని తగ్గేది లేదంటున్నాడు సై రా నిర్మాత చరణ్. ఇకపోతే ఈ సినిమా బిజినెస్ కూడా 300 కోట్ల రేంజ్ లో జరుగుతుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి మూవీ:
పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కలయికలో వస్తున్న అజ్ఞాతవాసి సినిమాకి 100 కోట్లపైనే బడ్జెట్ పెట్టింది హారిక అండ్ హాసిని క్రియేషన్స్ . పవన్ గత చిత్రాలు పల్టీ కొట్టినా ఇప్పుడు మాత్రం అజ్ఞాతవాసిపై భారీ అంచనాల నడుమ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందనే టాక్ ఉంది. దాదాపుగా 147 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన అజ్ఞాతవాసి జనవరి 10 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
రామ్ చరణ్ రంగస్థలం:
రామ్ చరణ్ ధ్రువ హిట్ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న రంగస్థలం సినిమా మీద కూడా మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాకి మైత్రి మూవీస్ వారు భారీ బడ్జెట్ ఎక్కించారు. అలాగే ఈసినిమాకి 80 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టుగా టాక్ వుంది. ఇకపోతే ఈసినిమా మార్చ్ 30 న విడుదలకు సిద్దమవుతుంది.
అల్లు అర్జున్ నా పేరు సూర్య:
అల్లు అర్జున్ - వక్కంతం వంశీ కలయికలో తెరకెక్కుతున్న నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా సినిమా నాగబాబు, బన్నీ వాస్ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతుంది. ఈ సినిమాకి కూడా 80 కోట్ల బిజినెస్ జరుగుతుందనే అంచనా వుంది. ఇకపోతే నా పేరు సూర్య వచ్చే ఏడాది ఏప్రిల్ 27 న విడుదల కాబోతోంది.
వరుణ్ తేజ్ తొలిప్రేమ:
ఫిదా సినిమా హిట్ తర్వాత వరుణ్ తేజ్ ఇప్పుడు వెంకట్ దర్శకత్వంలో రాశి ఖన్నా తో కలిసి తొలిప్రేమ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి 20 కోట్ల మేర బిజినెస్ జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు.
సాయి ధరమ్ తేజ్:
జవాన్ తో యావరేజ్ హిట్ అందుకున్న సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు మాస్ దర్శకుడు వినాయక్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. వీరి కలయికలో వస్తున్న ఈ సినిమాకి 30 కోట్ల బిజినెస్ జరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
మరి ఈ లెక్కన 2018 లో మెగా హీరోల సినిమాల బిజినెస్ ఏ లెవల్లో ఉండబోతున్నదో అర్దమయ్యిందిగా. 2018 లో మెగా హీరోల బిజినెస్ 600 కోట్ల పైమెరే ఉంటుందనేది మాత్రం జస్ట్ ఒక అంచనా మాత్రమే. ఎందుకంటే ఇప్పుడు పైన మనం చెప్పింది మచ్చుకు మాత్రమే. అది తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ హీరోల స్టామినా.