వర్మ ఎప్పుడు ఒకే విధంగా ఉండడు. తాను అభిమానించే వారు తప్పు చేస్తే ఎలా చీల్చిచెండాడుతాడో.. మంచి పని అనిపించినప్పుడు అంతగా ప్రశంసిస్తాడు. తప్పుని తప్పు,.. ఒప్పుని ఒప్పు అని చెప్పడం ఆయన నైజం. ఇక వర్మ చాలా కాలానికి మరలా పవన్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇటీవల పవన్ ఏపీలో నాలుగు రోజుల పాటు పర్యటించి, పోలవరం నుంచి కృష్ణానది పడవ బాధితుల వరకు తన అబిప్రాయాలు తెలిపాడు. తాజాగా దీనిపై వర్మ కాస్త లేటుగా స్పందించాడు. ఆయన ఫేస్‌బుక్‌లో పవన్‌పై తన అభిప్రాయాలను చెప్పుకొచ్చాడు. పవన్ చేసిన తాజా ప్రసంగాలను ఇప్పుడే విన్నాను.
ఆయన నిజాయితీ, పలు విషయాలలో ఎవరేమనుకుంటారోనని భావించకుండా ఆయన పేర్లతో సహా వారిపై, సమస్యలపై తనకున్న అభిప్రాయాలను నిజాయితీగా వెల్లడించాడు. ఆయనకు జరిగిన సంఘటనలతో పాటు భవిష్యత్తుపై కూడా మంచి అవగాహన ఉంది. తనపై ఉన్న పలు వదంతులకు ఆయన క్లారిటీ ఇవ్వడం చూస్తే ఆయన నిజాయితీ అర్ధమవుతుంది. ఆయన సమగ్రతకి ఇది ఓ ఉదాహరణగా నిలుస్తుంది. పవన్ ఏదైనా మాట్లాడే ముందు ఎంతో ఆలోచిస్తారు. నాకు ఆ విషయంలో పవన్‌ని చూసిన తర్వాత జ్ఞానోదయం అయింది.
నేను ఏదైనా మాట్లాడేటప్పుడు ట్వీట్ చేసేటప్పుడు ఏమీ ఆలోచించకుండా ముందు వెనక అనే ఆలోచన లేకుండా ఆ సమయంలో ఏది అనిపిస్తే అది చేస్తాను. అది నా స్టుపిడిటీ. ఈ విషయంలో నేను పవన్‌ని ఆదర్శంగా తీసుకోవాలనుకుంటున్నాను. ఈ నేపధ్యంలో పవన్‌కి నేను కృతజ్ఞతలు చెప్పాలి. ఆయన ఓ గొప్పనాయకుడు అవుతారంటూ ప్రశంసల వర్షం కురిపించాడు.