Advertisementt

అక్కినేని సమంత బైక్ చూశారా!

Sun 17th Dec 2017 01:24 AM
samantha,mahanati,bike pic,viral,social media  అక్కినేని సమంత బైక్ చూశారా!
Samantha Bike Pic Sensation అక్కినేని సమంత బైక్ చూశారా!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం అక్కినేని వారి ఇంటి కోడలు సమంత తెలుగులో సుకుమార్‌, రామ్‌చరణ్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న 'రంగస్థలం 1985' చిత్రంతో పాటు సావిత్రి బయోపిక్‌ 'మహానటి'లో నటిస్తోంది. ఈ రెండు చిత్రాలు దాదాపుగా పీరియాడికల్‌ మూవీలు కావడం విశేషంగా చెప్పుకోవాలి. ఇప్పటికే 'రంగస్థలం 1985' చిత్రం కోసం ఆ చిత్ర యూనిట్‌ నాటి కాలానికి చెందిన వాతావరణం, నాటి వస్తువులు, నాటి సమాజంలో ఉండే కుండలు, కూజాలు, కిడ్డీబంక్‌ల వంటి వాటిని పున:సృష్టించింది.

ఇక సమంత కూడా నాటి గ్రామీణ యువతులు ఎలా ఉంటారో అలా డీగ్లామరైజ్‌గా, అచ్చు పల్లెటూరి అమ్మాయిలా కనిపిస్తోంది. మరోపక్క 'ఎవడే సుబ్రహ్మణ్యం' ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో 'మహానటి' చిత్రంలో నటిస్తోంది. కీర్తిసురేష్‌, దుల్కర్‌ సల్మాన్‌, మోహన్‌బాబు, సమంత వంటి వారు ఇందులో కీలకపాత్రలను పోషిస్తున్నారు. ఈ చిత్రం విషయంలో కూడా వైజయంతీ మూవీస్‌ సంస్థ, దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ని నాటి కాలం, నాటి వస్తువులు, నాటి దుస్తుల వంటి వాటిని మరలా మనముందుంచే ప్రయత్నం చేస్తున్నారు.

ఇక ఇందులో సమంత జమున పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. నాటి కాలానికి అనుగుణంగా సమంత ఇందులో లూనా మోపెడ్‌ని ఎక్కి విహరించనుంది. నాటి కాలంలో ఎక్కువగా అందరూ లూనా మోపెడ్‌నే వాడేవారు. దాని కోసం సమంత లూనాని నడపనుంది. ఈ సందర్భంగా సమంత ట్వీట్‌ చేస్తూ కొందరి జీవితాలు అందరు తెలుసుకోవడానికి ఎంతో అర్హమైనవి. అందులో మహానటి సావిత్రి జీవితచరిత్రను కూడా చెప్పుకోవాలి.. అని పేర్కొంది. ఇక ప్రస్తుతం ఈ రెండు చిత్రాల షూటింగ్‌లో బిజీగా ఉన్న సమంత స్వయాన క్రిస్టియన్‌ కావడంతో కొద్దిరోజుల్లో రాబోయే క్రిస్మస్‌ వేడుకను వైభవంగా జరపడానికి సిద్దమవుతోంది. 

Samantha Bike Pic Sensation:

Samantha Mahanati Bike Pic Viral in Social Media

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ