Advertisementt

వైరల్‌ అవుతున్న హనీమూన్‌ సెల్ఫీ!

Sat 16th Dec 2017 08:01 PM
virat kohli,anushka sharma,honeymoon,selfie pic,social media  వైరల్‌ అవుతున్న హనీమూన్‌ సెల్ఫీ!
Virat Kohli and Anushka Sharma Honeymoon Selfie Viral వైరల్‌ అవుతున్న హనీమూన్‌ సెల్ఫీ!
Advertisement
Ads by CJ

గత కొన్నిరోజులుగా ఇండియన్‌ క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అనుష్కశర్మలు విపరీతంగా వార్తల్లో నిలబడుతున్నారు. నేడు దేశంలోని మోస్ట్‌ సెలబ్రిటీ కపుల్స్‌లో వీరే ప్రధమ స్థానంలో ఉన్నారు. ఇక వీరు ఇటలీలో వివాహం చేసుకుని వెంటనే హనీమూన్‌కి వెళ్లారు. విరాట్‌ కోహ్లి అంటే క్రికెట్‌ ఆడే ప్రతి ఒక్కరికి ఆయన తెలుసు. ఇక అనుష్క శర్మ కూడా ఎందరికో బాగా తెలుసు.

సో.. వీరికి గుర్తింపు ఉన్న ప్రదేశాలలో, జనసమ్మర్ధం ఎక్కువగా ఉండే ప్రాంతాలలో హనీమూన్‌ జరుపుకుంటే వారికి అభిమానుల నుంచి తాకిడి తప్పదు. వారి అత్యుత్సాహం వల్ల వీరు ఎంతో ఎంజాయ్‌ చేయాలనుకుంటున్న హనీమూన్‌ని సరిగా ఎంజాయ్‌ చేయలేరు. దీంతో ఈ జంట దక్షిణాఫ్రికాలోని పెద్దగా జనాలు ఉండని ఓ చిన్నదీవిలోని పలు ముఖ్యమైన ప్రాంతాలలో పర్యటిస్తూ తమ హనిమూన్‌ని ఎంజాయ్‌ చేస్తున్నారు.

తాజాగా అనుష్క శర్మ విరాట్‌కోహ్లితో కలిసి హనీమూన్‌ సందర్భంగా దిగిన సెల్ఫీని సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసింది. చుట్టూ మంచు పర్వాతాల మధ్య వీరు ఎంచక్కా ఎంజాయ్‌ చేస్తూ తమ ప్రేమ ఘాటుతో చలికే  ఛాలెంజ్‌ విసురుతున్నారు. ఈ  ఫోటోలను చూసిన వారంతా ఈ జంట తాము ఇష్టపడిన వారినే వివాహం చేసుకుని బాగా ఎంజాయ్‌ చేస్తున్నారని, చూడముచ్చటైన జంట అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

Virat Kohli and Anushka Sharma Honeymoon Selfie Viral:

Virat Kohli and Anushka Sharma Honeymoon Selfie Pic Sensation in Social Media

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ