శేఖర్ కమ్ముల చిత్రాలన్నీ ఎంతో ఫీల్‌గుడ్ మూవీస్‌గా, మనసులను తాకే సున్నిత భావోద్వేగాలతో సాగుతాయి. 'ఆనంద్' నుంచి ఆయన తీసిన ప్రతి చిత్రం అంతే. కానీ హిందీలో వచ్చిన 'కహాని'ని తెలుగులో 'అనామిక' పేరుతో ఓ రెవల్యూషనరీ ఫిల్మ్‌గా, 'లీడర్' చిత్రాలతో కాస్త డిఫరెంట్‌గా ట్రై చేసినా అవి పెద్దగా ఆడలేదు. మరలా ఎంతో కాలం తర్వాత తనదైన శైలిలోనే 'ఫిదా' తీసి మరో బ్లాక్‌బస్టర్ హిట్‌నిచ్చాడు. ఇక ఆయన తదుపరి చిత్రం ఏమిటి? అనేది అందరిలో ఆసక్తిని కలిగిస్తోంది.
రానా, నాని, శర్వానంద్ వంటి పేర్లు వినిపించాయి. రానాతో 'లీడర్'కి సీక్వెల్ చేస్తాడని కూడా వార్తలు వచ్చాయి. ఇక ఆయన 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' చిత్రంలోని నటుల గ్యాంగులో ఒకరిగా విజయ్‌దేవరకొండని పరిచయం చేశాడు. ఆ తర్వాత కూడా విజయ్ 'ఎవడే సుబ్రహ్మణ్యం, పెళ్లిచూపులు' వంటి క్లాస్ చిత్రాలలో నటించి క్లాస్ హీరోగా పేరు తెచ్చుకుంటున్న సమయంలో వచ్చిన 'అర్జున్‌రెడ్డి' చిత్రం ఓవర్‌నైట్ ఆయనను డిఫరెంట్ యాటిట్యూడ్‌తో, మాస్, యూత్ చిత్రాల హీరోని చేసింది.
మరి సున్నితమైన భావోద్వేగాలు పండించే శేఖర్‌కమ్ముల - విజయ్‌దేవరకొండల కాంబినేషన్‌లో ఓ చిత్రం వస్తోందంటే అది ఖచ్చితంగా ఏదో వైవిధ్యభరితమైన చిత్రం కావడం ఖాయమనే అంచనాలు ఏర్పడుతాయి. ప్రస్తుతం అదే జరుగుతోంది. ప్రస్తుతం పరుశురామ్ తో 'గీతాగోవిందం', రాహుల్ అనే దర్శకుడితో 'షికారు', 'మహానటి', త్రివిక్రమ్ నిర్మాతగా నందిని రెడ్డి సినిమా, క్రాంతిమాధవ్ దర్శకత్వంలో ఓ సినిమా వంటి వరుస చిత్రాలతో విజయ్ బిజీబిజీగా ఉన్నాడు విజయ్.
శేఖర్ కమ్ముల.. విజయ్‌ని కలిసి ఓ స్టోరీ చెప్పడం.. దానిని విజయ్ ఓకే చేయడం జరిగిపోయాయని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని శేఖర్‌కమ్ముల, విజయ్‌దేవరకొండ లేదా దిల్‌రాజులలో ఎవరో ఒకరు నిర్మించే అవకాశం ఉందని అంటున్నారు.