Advertisementt

రామ్ చరణ్ ఇంట్లో ఎన్టీఆర్.. రీజన్ ఇదే..!

Sat 16th Dec 2017 12:35 PM
ram charan,ntr,attends,christmas,party,ram charan house  రామ్ చరణ్ ఇంట్లో ఎన్టీఆర్.. రీజన్ ఇదే..!
Jr ntr in Ram charan House రామ్ చరణ్ ఇంట్లో ఎన్టీఆర్.. రీజన్ ఇదే..!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం టాలీవుడ్‌లో రాజమౌళి, రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌.. ఈ ముగ్గురి గురించే హాట్‌ టాపిక్‌ నడుస్తోంది. కేవలం టాలీవుడ్‌లోనే కాదు.. జాతీయ మీడియాలో కూడా అదే చర్చ సాగుతోంది. ఎప్పుడైతే జక్కన్న ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లతో కలిసి ఓ ఫొటోని తీసుకుని విడుదల చేశాడో ఈ ఇద్దరితో రాజమౌళి చేయబోయేది పక్కా మల్టీస్టారర్‌ చిత్రమేనని తేలిపోయింది. అయితే అధికారికంగా అనౌన్స్‌మెంట్‌ రాలేదు గానీ తెర వెనుక కథ రెడీ అవుతూ, హడావుడి జరుగుతూనే ఉంది. ఇక రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌లు మరోసారి కలవడంతో దీనికి మరింత బలం చేకూరింది. 

తాజాగా రామ్‌చరణ్‌ శ్రీమతి ఉపాసన విస్తరాకులతో క్రిస్మస్‌ చెట్టుని తయారు చేసింది. ప్రీ క్రిస్మస్‌ వేడుకలను కూడా వారు జరిపారు. దీనికి ఎన్టీఆర్‌ కుటుంబం కూడా హాజరై ఫొటోలు దిగింది. మరో వైపు రామ్‌చరణ్‌ ఇంట్లోనే ఆయన, అర్జున్‌రెడ్డి దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా, శర్వానంద్‌లు కూడా హాజరయ్యారు. ఇక ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లు కలిసి కనిపించడం పెద్దగా ఆశ్యర్యం కలిగించలేదు. ఎందుకంటే త్వరలో ఇద్దరు కలిసి పని చేయనున్నారు కాబట్టి వారిద్దరు కలిశారని భావించవచ్చు. మరోవైపు 'అర్జున్‌రెడ్డి' దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా, శర్వానంద్‌లు కలవడం మరో చర్చకు దారి తీసింది. శర్వానంద్‌ మెగాఫ్యామిలీకి మంచి సన్నిహతుడు. 

ఇక ఈ ఫొటో చూసిన వారు రామ్‌చరణ్‌, శర్వానంద్‌లతో సందీప్‌రెడ్డి సినిమా చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి. కానీ ఇది నిజం కాదని తెలుస్తోంది. త్వరలో రామ్‌చరణ్‌ ఓన్‌ బేనర్‌ అయిన కొణిదెల ప్రోడక్షన్స్‌లో సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో శర్వానంద్‌ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మించడానికి రెడీ అవుతుండటమే దీనికి కారణమని విశ్వసనీయ సమాచారం. 

Jr ntr in Ram charan House:

Jr ntr attends Charana Christmas Party

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ