సీనియర్‌స్టార్ వెంకటేష్‌కి కథ, తన పాత్ర నచ్చాలే గానీ ఏ హీరోతోనైనా కలిసి నటిస్తాడు. ఎంత చిన్న పాత్ర అయినా, అతిధి పాత్ర అయినా చేసేందుకు వెనుకాడడు. 'సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు'లో మహేష్‌బాబుతో, 'మసాలా' చిత్రంలో రామ్‌తో, 'గోపాల గోపాల' చిత్రంలో పవన్ కళ్యాణ్‌లతో కలిసి వెంకీ నటించాడు. ఇక ప్రస్తుతం ఆయన తేజ దర్శకత్వంలో సురేష్ ప్రోడక్షన్స్, ఎకెఎంటర్‌టైన్‌మెంట్స్ బేనర్‌లో ఓ చిత్రం చేయడానికి ఓకే చెప్పాడు.
ఆ తదుపరి చిత్రంగా పవన్-త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల కాంబినేషన్‌లో 'అజ్ఞాతవాసి' చిత్రాన్ని నిర్మిస్తున్న హారిక అండ్ హాసిని బేనర్‌లో రాధాకృష్ణ నిర్మాతగా త్రివిక్రమ్‌తో చిత్రం చేయనున్నాడు. ఇక గతంలో త్రివిక్రమ్ రచయితగా పనిచేసిన 'నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి' వంటి చిత్రాలను వెంకీ చేసి ఉన్నాడు. హారిక అండ్ హాసిని బేనర్‌కి సంబంధించిన మరో బేనర్ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బేనర్‌లో మారుతి దర్శకత్వంలో 'బాబు బంగారం' చేసి ఉన్నాడు. ఇక ఎంతో కాలంగా పవన్-త్రివిక్రమ్ శ్రీనివాస్-హారిక అండ్ హాసిని బేనర్‌లో రూపొందుతున్న 'అజ్ఞాతవాసి' చిత్రంలో కూడా ఓ కీలకమైన పాత్రను వెంకటేష్ చేస్తున్నట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. వీటిపై యూనిట్‌లోని ఎవ్వరూ స్పందించలేదు.
కానీ ఈచిత్రం థియేటర్లలో విడుదలైన తర్వాత అందరినీ సంభ్రమాశ్చర్యాలకు లోను చేస్తూ తెరపై వెంకీ కూడా దర్శనమివ్వనుండటం గ్యారంటీ అనే చెబుతున్నారు. ఇదే నిజమైతే మరోసారి 'గోపాల గోపాల' తర్వాత పవన్‌తో కలిసి వెంకీ నటించే చిత్రం ఇదే అవుతుంది. మరి ఏ విషయం తెలియాలంటే సంక్రాంతి కానుకగా జనవరి 10న 'అజ్ఞాతవాసి' చిత్రం విడుదలయ్యే వరకు వేచిచూడాల్సిందే.