Advertisementt

విరుష్క హనీమూన్‌ మూడ్ లో ఉన్నారు!

Sat 16th Dec 2017 12:08 PM
virat kohli,anushka sharma,reception,honeymoon mood  విరుష్క హనీమూన్‌ మూడ్ లో ఉన్నారు!
Anushka Sharma and Virat Kohli in Honeymoon Mood విరుష్క హనీమూన్‌ మూడ్ లో ఉన్నారు!
Advertisement
Ads by CJ

ఇండియన్‌ క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి తన కెరీర్‌ ప్రారంభంలో ఉత్తరాది భామ అయినప్పటికీ దక్షిణాదిలో పేరు తెచ్చుకున్న హీరోయిన్‌ తమన్నాతో కూడా ఏడాది పాటు డేటింగ్‌ చేశాడు. వీరిద్దరు కలిసి ఓ మొబైల్‌ కంపెనీ యాడ్‌లో కూడా నటించారు. వీరు పలుదేశాలలో షికార్లు కూడా కొట్టారు. ఆ తర్వాత విరాట్‌ జీవితంలోకి బ్రెజిల్‌ భామ ఇసబెల్‌లేతే ఎంటర్‌కావడంతో విరాట్‌, తమన్నాల మధ్య స్పర్దలు వచ్చాయి. ఆ తర్వాత విరాట్‌ లేతోతో కలసి సింగపూర్‌తో పాటు పలు ప్రదేశాలలో తిరిగి ఎంజాయ్‌ చేశాడు. ఆ తర్వాత వారు కూడా విడిపోయారు. ఎట్టకేలకు నాలుగేళ్ల ముందు విరాట్‌కోహ్లి జీవితంలోకి బాలీవుడ్‌ సుందరి అనుష్క శర్మ వచ్చింది. వీరిద్దరు కలసి డేటింగ్స్‌ చేస్తుండటంతో అందరూ.. ఆ.. ఇది కూడా మూణ్ణాళ్ల ముచ్చటే అని అభిప్రాయపడ్డారు.

కానీ విరాట్‌ కోహ్లి అనుష్కశర్మలు సుదీర్ఘకాలంగా అంటే నాలుగైదేళ్లుగా ప్రేమించుకుంటూ ఎట్టకేలకు తమ బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో ఇటలీలోని టస్కనీలో హిందు సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. ఇక హానీమూన్‌ని కూడా ఇటలీ రాజధాని రోమ్‌లోనే జరుపుకుంటున్నారు. ఈ పెళ్లి ఏర్పాట్లు, హనీమూన్‌కి సంబంధించిన పనులను స్వయంగా వీరిద్దరే నెలరోజుల ముందుగానే ప్లాన్‌ చేసుకున్నారు. ఇక గతంలో వీరిద్దరు కలిసి రోమ్‌కి ఎన్నోసార్లు వెళ్లినా కూడా పెళ్లి తర్వాత హనీమూన్‌కి వెళ్తుండటంతో ఈ ట్రిప్‌కి ఎంతో ప్రాధాన్యం ఏర్పడింది.

ఈ హనీమూన్‌ ముగిసిన తర్వాత వీరు ముంబై వచ్చి రిసెప్షన్‌ని 20వ తేదీన, సన్నిహితులకు పార్టీని 26వ తేదీన ఇవ్వనున్నారట. ఇక ఇండియాక్రికెట్‌ జట్టు సౌతాఫ్రికా పర్యటనకు కూడా వెళ్తున్న నేపధ్యంలో కోహ్లితో పాటు అనుష్క శర్మ కూడా వారితో కలిసి దక్షిణాఫ్రికా వెళ్లనుంది. అక్కడే న్యూఇయర్‌ సెలబ్రేషన్స్‌ జరుపుకుని జనవరి రెండో వారం కల్లా మరలా అనుష్క శర్మ సినిమా షూటింగ్‌లలో పాల్గొననుంది.

Anushka Sharma and Virat Kohli in Honeymoon Mood:

Anushka Sharma and Virat Kohli Reception after Honeymoon Mood

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ