అఖిల్ తాజా మూవీ హలో సినిమా మరొక వారంలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. నాగార్జున తన కొడుకు అఖిల్ కి ఈసారి గట్టి హిట్ అందించాలని తాపత్రయపడుతున్నాడు. మనం లాంటి హిట్ అందించిన విక్రమ్ కుమార్ చేతుల్లో అఖిల్ ని పెట్టినప్పటికీ నాగార్జున అన్ని విషయాల్లోనూ ఇన్వాల్వ్ అయ్యి హలో సినిమాని ఒక కొలిక్కి తెచ్చాడు. అందరిలోనూ హలో సినిమా మీద భారీ అంచనాలే వున్నాయి. ఆ లేవల్లోనే హలో సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదిరిపోయే లెవల్లో జరిగింది. సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ దగ్గరనుండి టీజర్, ట్రైలర్ వరకు హలో అందరిని బాగా ఆకట్టుకుని సినిమా మీద అంచనాలను పెంచేసింది.
హలో సినిమాని అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండడంతో ఈ సినిమాపై అందరిలో ఆసక్తి పెరిగింది. అలాగే సినిమాపై దర్శక నిర్మాతలు కూడా మంచి హోప్స్ పెట్టుకున్నారు. ఇటీవల వైజాగ్ లో జరిగిన ఆడియో వేడుకలో గ్యారెంటీగా హిట్ కొడుతున్నాం అంటూ హలో నిర్మాత నాగార్జున అందరికి భరోసా ఇచ్చేశాడు. మరి నాగ్ అన్నట్లుగానే హలో ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తుంటే మాత్రం నిజంగానే సినిమా హిట్ కొట్టే కళ ఎక్కువగానే కనబడుతుంది. హలో సినిమాపై బయ్యర్లు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో అనేది హలో వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ చూస్తుంటే అర్ధమవుతుంది.
హలో సినిమా ప్రపంచవ్యాప్త థియేట్రికల్ హక్కులు 32 కోట్లకు అమ్ముడు అయ్యాయి. మరి ఏరియాల వారీగా హలో ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు.
ఏరియా - ప్రీ రిలీజ్ బిజినెస్ (కోట్లలో)
నైజామ్: 9.00
సీడెడ్: 4.50
నెల్లూరు: 1.10
కృష్ణా: 2.10
గుంటూరు: 2.60
వైజాగ్: 3.20
తూర్పు గోదావరి: 2.20
పశ్చిమ గోదావరి: 1.80
టోటల్ ఏపీ, తెలంగాణ కలిపి: 26.50 కోట్లు
కర్ణాటక: 2.00
రెష్టాఫ్ ఇండియా: 0.50
ఓవర్సీస్: 3.00
టోటల్ వరల్డ్ వైడ్: 32.00 కోట్లు