మహేష్ బ్రహ్మోత్సవం, స్పైడర్ సినిమాలు డిజాస్టర్ కావడంతో భరత్ అనే నేను సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టాడు. కొరటాల శివ కూడా మంచి ఫామ్ లో ఉండటం.. శ్రీమంతుడు కూడా హిట్ అవ్వడంతో భరత్ అనే నేను సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని అభిమానులు ధీమాగా ఉన్నారు.
ఇది ఇలా ఉండగా మహేష్ భరత్ అనే నేను సినిమా తర్వాత మహేష్ వంశీ సినిమా తర్వాత ఏ సినిమా చేస్తాడో ఇంకా క్లారిటీ రాలేదు. ఈ సినిమా తర్వాత మహేష్ వంశి పైడిపల్లి, త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమాలు చేయబోతున్నానని మహేష్ చెప్పాడు. ఈ రెండు సినిమాలలో ఇంకా ఒకటి కూడా పట్టాలెక్కలేదు. కానీ త్రివిక్రమ్ ప్రస్తుతం అజ్ఞాతవాసి పైనే పూర్తి దృష్టి పెట్టాడు. సిడ్నీ తర్వాత త్రివిక్రమ్..అజ్ఞాతవాసి సినిమా ప్రొడ్యూస్ చేస్తున్న హారిక అండ్ హాసిని ప్రొడక్షన్ బ్యానర్ లోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా ఆల్రెడీ కొబ్బరికాయ కొట్టేశాడు.
ఎన్టీఆర్ తో సినిమా స్టార్ట్ అవ్వలేదు. అయితే హారిక అండ్ హాసిని యూనిట్ విక్టరీ వెంకటేష్ తో సినిమా అనౌన్స్ చేయడంతో.. త్రివిక్రమ్ మహేష్ తో సినిమా కష్టమని చెబుతున్నారు. కానీ మహేష్ రాజమౌళితో ఓ సినిమా చేయాలనీ ఆశ పడినప్పటికీ ప్రస్తుతం జక్కన్న ఎన్టీఆర్- రామ్ చరణ్ లతో మల్టీస్టారర్ స్టార్ట్ చేసే పనిలో పడ్డాడు. సో కచ్చితంగా మహేష్ - త్రివిక్రమ్ ఇప్పట్లో వుండే అవకాశం లేదు.