Advertisementt

పవన్ తర్వాత ఎన్టీఆరా లేక వెంకీనా?

Thu 14th Dec 2017 08:18 PM
trivikram srinivas,venkatesh,ntr,confusion  పవన్ తర్వాత ఎన్టీఆరా లేక వెంకీనా?
Trivikram Srinivas Confused NTR and Venki Fans పవన్ తర్వాత ఎన్టీఆరా లేక వెంకీనా?
Advertisement
Ads by CJ

త్రివిక్రమ్ ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి' సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వున్నాడు. 'అజ్ఞాతవాసి' సినిమా ప్రమోషన్స్ తోనూ పోస్ట్ ప్రొడక్షన్ పనులతోను బిజీగా వున్న త్రివిక్రమ్.... 'అజ్ఞాతవాసి' సినిమా విడుదల కాగానే ఒక నెలరోజుల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చి యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్లో సినిమాని పట్టాలెక్కించాల్సి ఉంది. ఇప్పటికే ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకి ఓపెనింగ్ కూడా అయ్యింది. ఇక ఫిబ్రవరి నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుందనే న్యూస్ కూడా ఉంది.

అయితే తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా హారిక హాసిని క్రియేషన్స్ వారి నిర్మాణ సారధ్యంలో సినిమా అని అధికారిక ప్రకటన రావడంతో అందరూ షాక్ తిన్నారు. అయితే ఎన్టీఆర్, రాజమౌళి మల్టీస్టారర్ సినిమాకి కమిట్ అయ్యాడని.. అందుకే త్రివిక్రమ్ ఇలా వెంకటేష్ తో సినిమాకి రెడీ అయ్యాడనే వార్తలు జోరుగా వినబడుతున్నాయి. అసలు ఎన్టీఆర్ సినిమాని త్రివిక్రమ్ పక్కనపెట్టేసినట్లే అనే టాక్ వినబడుతుంది.

మరోపక్క వెంకటేష్ ప్రస్తుతానికి తేజ డైరెక్షన్ లో 'ఆటా నాదే - వేట నాదే' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తికాగానే త్రివిక్రమ్ సినిమాకి జంప్ అవుతాడని అంటున్నారు. అయితే హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ నుండి వినబడుతున్న మాట ప్రకారం... వెంకటేష్ ప్రస్తుతం తేజ డైరెక్షన్ లో చేస్తున్న సినిమా పూర్తవడానికి సమయం పడుతుంది.... కాబట్టి త్రివిక్రమ్ తో వెంకీ  సినిమా అనౌన్స్ చేసినా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి మరికొంత కాలం పడుతుంది. అలాగే రాజమౌళి షూటింగ్ స్టార్ట్ చేసేపాటికి త్రివిక్రమ్ డైరెక్షన్ చేస్తున్న సినిమాలో ఎన్టీఆర్ చేయాల్సిన పార్ట్ చాలా వరకు పూర్తయిపోతుంది. కాబట్టి ఇబ్బందేమీ ఎదురు కాకపోవచ్చనేది హారిక హాసిని వారి  మాట. మరి వారన్నట్టుగా ఇదెలా సాధ్యమవుతుందో అనేది కాస్త వేచి చూస్తే గాని అర్దమవదు అంటున్నారు. చూద్దాం ఫైనల్ గా ఏం జరుగుతుందో...?

Trivikram Srinivas Confused NTR and Venki Fans:

Confusion Starts with Venki and Trivikram Combo

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ