అనుకోకుండా వెంకటేష్‌ని హీరోని చేయాలని డిసైడ్ అయ్యాం. అందుకే ఆయన్ను మేం కలం పుత్రుడు అంటాం. ఇక 'కలియుగ పాండవులు' కథ, మాటలు రాసే సమయంలోనే మేము బాలకృష్ణ నటిస్తున్న 'కలియుగ కృష్ణుడు'కి కూడా స్రిప్ట్ రాస్తున్నాం. రెండు చిత్రాలను 1986 జనవరి 1న ప్రారంభించాలి. కానీ అప్పటికే డిసెంబర్ 27వ తేదీ వచ్చేసింది. దాంతో కేవలం రెండు రోజుల్లో నిద్ర లేకుండా మా అసిస్టెంట్ అయిన వైవిఎస్ చౌదరితో కలిసి రెండు స్క్రిప్ట్‌లు పూర్తి చేశాం. ఇలా రెండు రోజుల్లో రాసిన ఈ రెండు చిత్రాలు శతదినోత్సవం జరుపుకోవడం ఎంతో ఆనందం.
ఇక సాదారణంగా కథలను మా అన్నయ్య వెంకటేశ్వరరావు రాస్తారు. డైలాగ్స్ నేను రాస్తాను. ఇలా ఇద్దరం కలసి 'కలియుగ పాండవులు'కి రెండు వెర్షన్స్ రాశాం. ఇక సినిమా షూటింగ్ సమయంలో వెంకటేష్ ఎంతో వినయంగా ఉండే వాడు. రామానాయుడి గారి అబ్బాయిని అనే ఫీలింగ్ గానీ గర్వంగానీ ఆయనకు లేవు. మా వద్దకు వచ్చి సార్.. ఈ సీన్ కాస్త చదివి వినిపించండి అని వినయంగా అడిగే వాడు. అంతలా ఆయన శ్రద్ద పెట్టేవాడు. నేర్చుకోవాలనే తపన ఉండే వాడు ఎప్పుడు ఎదుగుతాడు.
'గణేష్' చిత్రం సమయంలో కూడా 'ఎనీ సెంటర్.. సింగిల్ హ్యాండ్..' డైలాగ్‌ని పలకడానికి తరచి తరచి ఎలా డైలాగ్ చెప్పాలో మమ్మల్ని వచ్చి అడిగే వాడు. ఆయనలోని తపన చూసి ఎంతో ఆనందపడ్డాం. అలాంటి వారు ఎప్పటికైనా ఎదుగుతారని చెప్పడానికి వెంకటేషే ఉదాహరణ. నేర్చుకోవాలన్న తపన ఉన్న వారే పైకొస్తారు. ఆతర్వాత కూడా ఆయనతో కలిసి పనిచేశాం.. అంటూ పరుచూరి గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు.
ఇక వెంకటేష్.. తేజ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. ఆ తర్వాతి చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని బేనర్‌లో రాధాకృష్ణ అలియస్ చిన్నబాబు బేనర్‌లో చేయనున్నాడు. గతంలో విజయభాస్కర్ దర్శకత్వంలో వచ్చిన వెంకటేష్ చిత్రాలైన 'నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి' చిత్రాలు ఎంతటి విజయం సాధించాయో తెలిసిందే. ఆ చిత్రాలకు త్రివిక్రమ్ రచయితే కాకుండా మెయిన్ పిల్లర్‌గా చెప్పుకోవాలి. మరి వీరి కాంబినేషన్‌లో వచ్చే చిత్రం త్రివిక్రమ్‌తో పవన్ 'అజ్ఞాతవాసి' తర్వాత ఎన్టీఆర్‌తో చిత్రాల అనంతరం హారిక అండ్ హాసిని బేనర్‌లో ఆరవ చిత్రంగా రూపొందనుంది...!