అక్కినేని అఖిల్ నటించిన 'హలో' చిత్రం ఈనెల 22న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇటీవలే విడుదలైన ఆడియోకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఇక ఆమధ్య విడుదల చేసిన 'మెరిసే మెరిసే' పాటలోని స్టెప్స్ బాగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా విడుదల చేసిన 'హలో' టైటిల్ సాంగ్‌లోని అఖిల్ వేసిన స్టెప్స్ ఎంతో చూడముచ్చటగా ఉన్నాయి. ఫ్రెష్‌ఫీల్‌తో సాగే ట్యూన్, దానికి తగ్గట్లుగా ఫీల్‌గుడ్‌గా సాగుతున్న ఈ సాంగ్ పిక్చరైజేషన్ కూడా ఎంతో ఫ్రెష్‌గా సాగింది.
ఇక అఖిల్ మొదటి చిత్రం 'అఖిల్' డిజాస్టర్ అయినా సరే అందులో అఖిల్ వేసిన స్టెప్స్‌కి అందరూ ఫిదా అయిపోయారు. అదే స్టెప్స్ మ్యాజిక్‌ని 'హలో'లో అఖిల్ మరోసారి చూపించాడు. ముఖ్యంగా టైటిల్ సాంగ్‌లో మొహం చూపించకుండా అఖిల్ ఇద్దరు డ్యాన్సర్లతో వేసిన స్టెప్, చివరలో ఆ ఇద్దరు డ్యాన్సర్లు స్క్రీన్ నుంచి తప్పుకోగానే బ్యాగ్రౌండ్‌లో వానలో పిల్లలు వేసే కేరింతలు ఎంతో బాగున్నాయి. ట్యూన్‌కి తగ్గట్లుగా స్టెప్స్ ఎలివేట్ అయ్యాయి. ఇక ఈ చిత్రాన్ని యూఎస్‌లో కూడా భారీగా ప్రమోట్ చేస్తున్నారు. పలు చోట్ల పలు ప్రమోషన్ కార్యక్రమాలను అరేంజ్ చేశారు. వాటిల్లో పాల్గొనేందుకు అఖిల్ యూఎస్ వెళ్లాడు.
కానీ అఖిల్‌కి ఒంటరిగా ప్రమోషన్ చేసిన అనుభవం పెద్దగా లేదు. దాంతో రానాకి యూఎస్‌లో మంచి ఫాలోయింగ్ ఉండటంతో నాగార్జున యూఎస్ ప్రమోషన్స్ కోసం అఖిల్‌తో పాటు రానాని కూడా పంపాడు. ఇక ఈ చిత్రంతో గ్యారంటీగా బ్లాక్‌బస్టర్ కొట్టనున్నామని నాగ్ ఎంతో కాన్ఫిడెంట్‌గా చెబుతున్నాడు. అంతేకాదు.. విక్రమ్ కె.కుమార్‌ను మరోసారి తమ బేనర్‌లోనే చేయమని పబ్లిక్‌గా అడిగి మరీ ఆయన చేత సరే అనిపించేలా చేసిన నాగ్ సామాన్యుడు కాదని, భలేగా విక్రమ్‌ని కమిట్ చేయించాడని అంటున్నారు.