బాలకృష్ణ - కేఎస్ రవికుమార్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం జై సింహా. ఈ సినిమా మొదలైనప్పటి నుండి కథ గురించి ఇండస్ట్రీలో చాలా పుకారులు వచ్చాయి. ముందు ఈ సినిమాకు కర్ణ అనే పెట్టాలనుకున్న. కానీ జై సింహా పెట్టారు. కర్ణ టైటిల్ పెట్టాలనుకోవడం ఈ సినిమా కథే అని టాక్.
ఈ సినిమాలో బాలయ్య భగ్న ప్రేమికుడట. హీరోయిన్ నయనతారని ప్రేమిస్తాడు కానీ ఆమెకు కిక్ శ్యామ్ తో పెళ్లి అయిపోతుందంట. అయినా గాని బాలయ్య తనకి ఏం కావాలో, ఆమెకు అండగా ఉండటం, ఆమె కోసం త్యాగాలు చేయటం అన్నది కథ అని వార్తలు వస్తున్నాయి.
కేఎస్ రవికుమార్ ఎమోషనల్ కంటెంట్ ను తెరపై బాగా చూపించగలడు. అలాగే బాలయ్య కూడా ఎమోషనల్ మూవీస్ లో చెలరేగిపోతాడు. వీరి కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం అభిమానుల ఊహకి తగ్గట్టుగానే ఉంటుందని.....జై సింహా కచ్చితంగా ఫ్యాన్స్ కు సరైన పొంగల్ ట్రీట్ అనే అనుకోవాలి.