సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న రంగస్థలం సినిమాకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ ఇది. రంగస్థలం సినిమా నుంచి రావు రమేష్ ను తప్పించి.... ఆ స్థానంలో వెంటనే ప్రకాష్ రాజ్ ను తీసుకున్నారనే న్యూస్ బయటికి వచ్చింది. రావు రమేష్ ని తప్పించిన వెంటనే... ప్రకాష్ రాజ్ తో చకచకా రీషూట్ కూడా పూర్తిచేశారని అంటున్నారు. అయితే ఈ తతంగం మొత్తం కొన్ని రోజుల కిందటే పూర్తయిందని..... మీడియాకు ఎలాంటి లీకులు లేకుండా, అసలు చిత్ర బృందంలోని కొందరికి అక్కడ షూటింగ్ స్పాట్ లో ఏం జరుగుతుందో కూడా అర్థంకాకముందే ఈ రీషూట్ ప్రక్రియ పూర్తయిందట. కాకపోతే రంగస్థలం నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కు మాత్రం తడిసిమోపడైందని అంటున్నారు.
అసలింతకీ రావు రమేష్ రంగస్థలం సినిమా నుండి తప్పుకోవడానికి కారణమేమిటంటే... ఈ సినిమా దర్శకుడు సుకుమార్ కి రావు రమేష్ కు మధ్య సెట్స్ లో పొసగడం లేదట. చాలారోజుల నుంచి వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఒక దశలో వ్యవహారం ముదరడంతో రావు రమేష్ తప్పుకున్నాడట. అయన అలా తప్పుకున్నాడో.. లేదో ఇలా ఆ స్థానాన్ని ప్రకాష్ రాజ్ తో భర్తీచేశారట. అయితే ఈ సినిమాలో భూస్వామిగా కనిపించనున్నాడట ప్రకాష్ రాజ్.
అలాగే రంగస్థలం సినిమాకు సంబంధించి ఇప్పుడు కూడా రీషూట్ ప్రాసెస్ నడుస్తోంది. కాకపోతే అది ప్రకాష్ రాజ్ తో మాత్రం కాదట. వేరేగా కొన్ని సీన్స్ మీద తృప్తి కలగక సుకుమార్ ఇలా రీషూట్ చేస్తున్నాడట. ఇకపోతే రంగస్థలం సినిమాకు సంబంధించి తాజాగా ఫస్ట్ లుక్ రిలీజైంది. ఈ లుక్ తో పాటు మరికొన్ని స్టిల్స్ కూడా చిత్ర బృందానికి తెలియకుండా లీక్ అవ్వడంతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు మేకర్స్.