బాలనటిగా నటించినా కూడా అల్లుఅర్జున్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఉత్తరాది భామ హన్సిక. మొదట్లో ఒకటి రెండు హిట్స్ వచ్చినా ఆ తర్వాత మాత్రం విజయాలు ఆమెను పలకరించలేదు. దాంతో కోలీవుడ్‌కి వెళ్లి అక్కడ తన బొద్దు అందాలతో తమిళ తంబీలను బాగానే మెప్పించింది. ఇక తెలుగులో మాత్రం మంచు విష్ణు, రవితేజలతో సరిపెట్టుకుంటోంది. తమిళంలో మాత్రం విజయ్, విశాల్, జయంరవి వంటి వారి సరసన నటించింది. ఇటీవలే బరువు కూడా తగ్గి కాస్త స్లిమ్ అయింది. ఇక ఈమెకు ప్రభుదేవా, శింబులతో ఎఫైర్లు ఉన్నాయని నాడు వార్తలు హల్‌చల్ చేశాయి.
ఇక ఇటీవల ఈ భామ బాగా బరువు తగ్గి స్లిమ్‌గా తయారైంది. ప్రస్తుతం ఆమె ప్రభుదేవాతో కలిసి 'గులేబగావళి' చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలోని ఓ పాటకి సంబంధించిన స్టిల్ ఇటీవల తాజాగా విడుదలైంది. ఈ ఫోటోలో ప్రభుదేవా గుండెలపై హన్సిక బొమ్మను టాటూగా వేసుకోగా ఆ టాటూని చూపిస్తున్న హన్సిక అందులో కనిపిస్తోంది. ఇక తాజాగా ఆమెకి మరో ఆఫర్ వచ్చిందట. గత కొంతకాలంగా ఆమె తనతో ఇప్పటివరకు నటించని ఆధ్వర్యంలో ఎఫైర్ నడుపుతోందని వార్తలు వస్తున్నాయి. తాజాగా అధర్వ హీరోగా, హన్సిక హీరోయిన్‌గా ఓ చిత్రం రూపొందనుంది.
అజిత్‌తో సినిమా తీయాలని భావించిన ఆరా ప్రోడక్షన్స్ అధినేతలు దానికి చాలా సమయం పట్టే అవకాశాలు ఉండటంతో ప్రస్తుతం అధర్వ, హన్సికలతో ఓ చిత్రం ప్రారంభించనున్నారు. గతంలో రెండు మూడు మంచి కమర్షియల్ చిత్రాలు తీసిన దర్శకుడు శ్యాంఆంటోని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటివరకు కోటి రూపాయల దాకా రెమ్యూనరేషన్ తీసుకున్న హన్సిక ప్రస్తుతం తన రెమ్యూనరేషన్‌ని తగ్గించడంతోనే ఆమెకి ఈ ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇక హన్సిక స్లిమ్‌గా మారిన తర్వాత చేస్తున్న రెండో చిత్రం ఇది. మరి 'గులేభగావళి'తో పాటు అధర్వ చిత్రాలను తమిళ తంబీలు ఎలా రిసీవ్ చేసుకుంటారు? స్లిమ్‌గా ఉన్నఈ భామని ఇంతకు ముందులానే ఆదిరిస్తారా? లేదా? అనేది వేచిచూడాల్సివుంది...!