వరుస హిట్ చిత్రాల హీరో, హిట్ చిత్రాల నిర్మాత, హిట్ హీరోయిన్.. ఇలా అందరూ ఒకే సినిమాకి పనిచేస్తే.. మరి వారి నుండి వచ్చే ఆ సినిమా కూడా హిట్ అయ్యే కళలే ఎక్కువగా కనబడతాయి. ఇప్పుడు అదే మాదిరి వరుస హిట్స్ తో దూసుకుపోతున్న నాచురల్ స్టార్ నాని, మీడియం చిత్రాలతో హిట్ కొట్టే నిర్మాత దిల్ రాజు, ఒకే ఒక్క సినిమా హిట్ తో హిట్ హీరోయిన్ అయిన సాయి పల్లవిలు కలయికలో MCA మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమాని దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, పాటలు MCA చిత్రంపై అంచనాలు పెంచేస్తుంటే... ఇప్పుడు వదిలిన థియేట్రికల్ ట్రైలర్ తో ఈ సినిమా గ్యారెంటీ హిట్ అనేలా కనబడుతుంది.
ఇక MCA థియేట్రికల్ ట్రైలర్ లో మిడిల్ క్లాస్ అబ్బాయిల కష్టాలను కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. ఇక ఈట్రైలర్ లో నాని తన ఒరిజినల్ పేరుతో నటించాడు. నానికి అన్నగా నటించిన రాజీవ్ కనకాల తన భార్య భూమికకు వరంగల్ ట్రాన్సఫర్ అవడంతో నానిని పిలిచి వదినతో వరంగల్ వెళ్ళమంటే.. దానికి నాని ఆవిడతో వరంగల్ వెళ్లడమా.. అంటుంటే.. ఆవిడ కాదు వదిన అని చెప్పడమే తరువాయి.... భూమికను వదిన అని పిలవడమే ఇష్టం లేని నాని తప్పక వరంగల్ వెళతాడు. అక్కడ భూమిక పెట్టే కష్టాలను భరించలేక పిన్నితో మొరపెట్టుకుని వచ్చేస్తానంటాడు.. ఇంతలో రాగిణి (సాయి పల్లవి) నానిని ప్రేమిస్తూ పెళ్ళెప్పుడు అంటూ వెంటపడడం.. అలాగే నాని ఫ్యామిలీకి వచ్చిన ఒక సమస్యను పరిష్కరించడంలో నాని చేసిన యాక్షన్ ఫీట్స్.. కామెడీ ఇలా ట్రైలర్ మొత్తం అదిరిపోయింది. కాకపోతే ట్రైలర్ మొత్తం నానినే కనబడుతున్నాడు. నాని నటనతో మిగిలిన కేరెక్టర్స్ ని ఎప్పటిలాగే.. డామినేట్ చేసేశాడు.
మరి మళ్ళీ నాని MCA తో మరో హిట్ కొట్టడానికి రెడీగా ఉన్నాడని తెలిసిపోతుంది. ఇకపోతే ఈసినిమాకి దేవిశ్రీ ఇచ్చిన మ్యూజిక్ ఇంకా బలాన్ని చేకూర్చుతుంది. మరి ఈ నెల 21న థియేటర్స్ లోకి వస్తున్న MCA సినిమా ఇంకెంతగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూద్దాం.