ఈ ఏడాది పెద్ద స్టార్స్ సినిమాలు బాగానే రిలీజ్ అయ్యాయి కానీ అనుకున్న స్థాయిలో సినిమాలు ఆడలేకపోయాయి. సినిమా కలెక్షన్స్ పరంగా కూడా అంతగా బిజినెస్ చేయలేకపోయాయి. ఇక గత నెలలో వచ్చిన చిన్న సినిమాలు బాగానే సందడి చేశాయి. కానీ ఏ సినిమాలు పూర్తిగా సంతృప్తిని ఇవ్వలేకపోయాయి.
కానీ 2018 మొత్తం సినీ ప్రేక్షకులకి పండగే అని చెప్పుకోవాలి. ఎందుకంటే బడా సినిమాలు రిలీజ్ కానున్నాయి. పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. ఈ సినిమాలు పై అంచనాలు భారీగా ఉన్నాయి.
2018 స్టార్టింగ్ లో సంక్రాంతికి పవన్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో అజ్ఞాతవాసి రిలీజ్ అవుతుంది. ఈ సినిమా గురించి టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఎదురు చూస్తుంది. అలాగే రామ్ చరణ్ సినిమా రంగస్థలం సినిమాతో పాత కాలాన్ని కొత్తగా చూపించబోతున్నాడు. ఈ సినిమాను సుకుమార్ డైరెక్షన్ చేస్తున్నాడు ఈ సినిమా మార్చ్ 30 న విడుదల కానుంది.
ఏప్రిల్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు - కొరటాల శివ కాంబినేషన్ లో భరత్ అనే నేను సినిమా రాబోతుంది. బాక్స్ ఆఫీస్ వద్ద మహేష్ తన సత్తా చూపిస్తాడు అని తన అభిమానులు భావిస్తున్నారు. అదే నెలలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా నా పేరు సూర్యా సినిమాతో రానున్నాడు. ఈ సినిమాకు రైటర్ వక్కంతం వంశీ తొలిసారిగా మెగా ఫోన్ పట్టాడు. ప్రేక్షకులకు కూడా ఆ సినిమాలు నచ్చే అవకాశం ఉంది.
బాలకృష్ణ కూడా సంక్రాంతి రేసులో వున్నాడు జై సింహ సినిమాతో. ఈ సినిమాను కే ఎస్ రవి కుమార్ డైరెక్ట్ చేశాడు. ఇక ఈ సినిమాలతో పాటు ప్రభాస్ - సాహో అండ్ ఎన్టీఆర్ న్యూ మూవీ కూడా 2018లో వస్తే అందరి అభిమానులకే స్పెషల్ ఇయర్ అని చెప్పవచ్చు.