Advertisementt

జనసేనకి నేనున్నా.. అంటోన్న రామ్ చరణ్!

Tue 12th Dec 2017 10:41 PM
ram charan,pawan kalyan,publicity,jana sena leaders  జనసేనకి నేనున్నా.. అంటోన్న రామ్ చరణ్!
Ram Charan Supports Pawan Kalyan Janasena జనసేనకి నేనున్నా.. అంటోన్న రామ్ చరణ్!
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అజ్ఞాతవాసి సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి.... తన పార్టీ అయిన జనసేనని తెలుగు రాష్ట్రాల్లో బలోపేతం చేసే పనుల్లో బిజీగా ఉన్నాడు. అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో ఒంటరిగానే పోరాడుతున్నాడు. ఒక్క మెగా ఫ్యామిలీ మెంబెర్ కూడా పవన్ కళ్యాణ్ కి తోడుగా లేరు. అయితే ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ ఈ రాజకీయాల విషయంలో అండగా నిలవాలని.... వచ్చే ఎన్నికల్లో బాబాయ్ పార్టీ జనసేన తరుపున ప్రచారం చేయాలని భావిస్తున్నాడట అబ్బాయ్ రామ్ చరణ్.

ఇకపోతే ప్రస్తుతం జనసేనాని ప్రజా సమస్యలతో ఏపీ రాష్ట్రాన్ని ఆగమేఘాల మీద చుట్టేస్తున్నపవన్ కళ్యాణ్.. జనసేన తరుపున వచ్చే ఎన్నికల్లో అంటే 2019  ఎన్నికల్లో పోటీ చేస్తామని.. అభ్యర్థులను నిలబెడతామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేసిన నేపథ్యంలో బాబాయ్ కి అండగా ఉండాలని ఫిక్స్ అయ్యాడట రామ్ చరణ్. అయితే ప్రస్తుతం రామ్ చరణ్ ఈ విషయాన్నీ అటు బాబాయ్ పవన్ కళ్యాణ్ తో కానీ నాన్న చిరంజీవితో కానీ ఇంకా చర్చించలేదట. త్వరలోనే చిరంజీవితో అలాగే బాబాయ్ లు నాగబాబు,  పవన్ కళ్యాణ్ లతో చర్చించి జనసేన పార్టీ తరుపున ప్రచారంపై నిర్ణయం తీసుకోనున్నాడట చరణ్.

గతంలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన సమయంలో విఫలం అయినప్పటికీ జనసేన విషయంలో మాత్రం విఫలం కావద్దని గట్టిగా నిర్ణయించుకున్నాడట ఈ మెగా హీరో. ప్రస్తుతం రామ్ చరణ్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న రంగస్థలం అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ మార్చ్ 30 న రిలీజ్ అవుతుంది. మరోపక్క బోయపాటి సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చరణ్  తన తండ్రి సైరా నరసింహారెడ్డి సినిమా ప్రొడక్షన్ బాధ్యతలని కూడా దగ్గరుండి చూసుకుంటున్నాడు.

Ram Charan Supports Pawan Kalyan Janasena:

Ram Charan Publicity to Jana Sena Leaders

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ