Advertisementt

విరుష్క జంట పెళ్లయ్యాక వదులుతున్నారు!

Tue 12th Dec 2017 08:05 PM
anushka sharma,virat kohli,marriage,photos,updates  విరుష్క జంట పెళ్లయ్యాక వదులుతున్నారు!
Anushka Sharma and Virat Kohli Marriage Updates విరుష్క జంట పెళ్లయ్యాక వదులుతున్నారు!
Advertisement
Ads by CJ

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ – బాలీవుడ్ హీరోయిన్  అనుష్క శర్మ ల ప్రేమ బంధం కాస్త ఇప్పుడు పెళ్లి బంధంగా మారి వీరిద్దరూ ఒక్కటయ్యారు. ఎప్పటినుండో ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట ఎట్టకేలకు పెళ్లితో ఒక్కటైంది. వీరి పెళ్లి ఇటలీలో కుటుంబ సభ్యుల సమక్షంలో సోమవారం(11 /12 /17 ) అంగరంగ వైభవంగా జరిగింది. గత ఏడాది నుండే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలొచ్చినప్పటికీ.. ఆ పెళ్లి మాత్రం ఇప్పుడు చూడముచ్చటగా జరిగిపోయింది. అయితే విరాట్ తో సహా అనుష్క శర్మ కూడా తమ పెళ్లి విషయాన్ని ఎంతో సీక్రెట్ గా దాచిపెట్టింది.

కానీ వారెంత సీక్రెట్ గా పెళ్లి పనులు జరిపేసుకుంటే మాత్రం... వారిని మీడియా వదులుతుందా... గత వారం రోజులుగా అనుష్క - విరాట్(విరుష్క) పెళ్లి ఇటలీలో జరగబోతుందని ఎప్పటికప్పుడు ఫీలర్లు వదులుతూనే ఉంది. కానీ అనుష్క సైడ్ నుండి, విరాట్ సైడ్ నుండి ఎటువంటి క్లూ లేదు. కానీ ఇప్పుడు అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుని ఆ పెళ్లి ఫొటోస్ ని తమ అధికారిక ట్విట్టర్ లో పోస్ట్ చేసింది ఈ అందమైన ప్రేమ జంట విరుష్కలు. ఇక ఈ పెళ్లి లో విరాట్, అనుష్క లు ఎంతో సంతోషంగా ఉత్సాహంగా ఉల్లాసంగా కనబడ్డారు. ఇకపోతే ఈ నెలలోనే విరాట్ - అనుష్క లు ముంబై లో గ్రాండ్ రిసెప్షన్ కి ఏర్పాట్లు కూడా చేసుకున్నారట.

Anushka Sharma and Virat Kohli Marriage Updates:

Anushka Sharma and Virat Kohli Posted Marriage Photos

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ