సమంతని ఇలా చూసి అయ్యో అంటున్నారు!
Samantha Rangasthalam Look Sensation in Social Mediaఈ మధ్యన నాగ చైతన్య ని పెళ్లాడిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గ్లామర్ పరంగా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నాగ చైతన్యని పెళ్లాడినప్పుడు కూడా సమంత మోడరన్ డ్రెస్సులతో క్లివేజ్ షోతో రెచ్చిపోయింది. అలాగే పార్టీలలో కూడా సమంత హాట్ హాట్ లుక్స్ తో కనబడుతూ సందడి చేసేది. అటు చేనేత చీర కట్టినా.. ఇటు మోడరన్ డ్రెస్సు వేసినా సమంత గ్లామర్ కి వంక పెట్టే వారే లేరు. సినిమాల విషయంలోనూ గ్లామర్ డాల్ గా వెలుగొందుతున్న సమంత ఒక్కసారిగా డీ గ్లామర్ గా కనబడి షాక్ ఇచ్చేసింది.
సుకుమార్ - రామ్ చరణ్ కలయికలో తెరకెక్కుతున్న రంగస్థలం సినిమా 1985 లోని పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఆ సినిమాలో అటు రామ్ చరణ్, ఇటు సమంత కూడా పక్కా పల్లెటూరోళ్ళలాగా కనబడుతున్నారు. చరణ్.. చిట్టి బాబు లుక్ ఇప్పటికే జనాల్లోకి వెళ్లగా... తాజాగా సమంత లంగావోణీలో అమాయకపు పల్లెటూరి పడుచు లుక్ ఇంటర్ నెట్ లో వైరల్ అయ్యింది. ఎప్పుడూ గ్లామర్ షో చేసే సమంత ఒక్కసారిగా రంగస్థలం కోసం ఇలా మారిపోవడం సమంత అభిమానులకు ఒక పక్క ఆనందంగా ఉన్నా. మరోపక్క కాస్త బాధగాను ఉంది.
ఇకపోతే రంగస్థలంలోని సమంత లుక్ అందరిని విపరీతంగా ఆకట్టుకుంటుంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగస్థలంలో సమంత మాత్రం కొత్త తరహాగా కనబడుతుంది. పల్లెటూర్లలో అమ్మాయిలు ఎలా ఉంటారు.. ఏ ఏ పనులు చేస్తారు అలాంటివన్నీ సమంత ఈ సినిమాలో చేస్తూ కష్టపడుతుంది. అందులో భాగంగానే గేదెలను తీసుకువస్తూ.. కట్టెల పొయ్యి వద్ద వంట చేస్తూ ఉన్న సమంత లుక్ చూస్తుంటే కచ్చితంగా సమంత ఈ సినిమాలో పేదింటి అమ్మాయిలాగే కనిపిస్తుందనేది అర్ధమవుతుంది. మరి తమ అభిమాన హీరోయిన్ ఇలా కష్టపడుతుంటే.. అయ్యో అని ఫీల్ అవుతున్నారు అభిమానులు.
Samantha Rangasthalam Movie Photos Hulchal in Social Media






































