ఎవరు వదిలిపెట్టినా పవన్‌ని ఫిల్మ్‌క్రిటిక్ మహేష్ కత్తి వదిలిపెట్టేలా లేడు. తనపై పవన్ అభిమానులు రాజ్యాంగవిరుద్దంగా చేసిన అప్రజాస్వామికమైన దాడిని ఆయన ఇప్పట్లో మర్చిపోయేలా కనిపించడం లేదు. తనపై దాడి చేస్తామని, చంపుతామని పవన్ అభిమానులు చేసిన పైత్యపు మాటలకు ఆయన రగిలిపోతూనే ఉన్నట్లు ఉన్నాడు. మరోవైపు తన ఫ్యాన్స్‌ని వారించడంలో, కట్డడిచేయడంలో విఫలమైన పవన్‌ని కూడా మహేష్ రచ్చకీడుస్తున్నాడు.
తాజాగా ఒంగోలులో జరిగిన జనసేన పార్టీ సమన్వయకర్తల సమావేశంలో పాల్గొన్న తాను ఎంతగా నరకం చూశానే చెబుతూ, విజయలక్ష్మి అనే మహిళ చెబుతున్న వీడియోను మహేష్ పోస్ట్ చేస్తూ మరోసారి పవన్‌పై ఆయన అభిమానులపై ఒంటికాలిపై లేచాడు. పవన్ తనను విమర్శించిన వారికి అదో టైం వేస్ట్ పని అని, తనపై వచ్చే విమర్శలను తాను పట్టించుకోనని చెప్పినా కూడా మరోసారి ఆయన పవన్‌నే టార్గెట్ చేశాడు. ఇద్దరు పిల్లలు కలిగి, పదేళ్లకు పైగా కలసి జీవించిన రేణూదేశాయ్‌కి ఫ్యాన్స్ నుంచి బెదిరింపులు వస్తే ఒక్క మాట కూడా మాట్లాడని పవన్‌కళ్యాణ్ జనసేనలోకి వచ్చే మహిళలకు ఎలా రక్షణ కల్పిస్తాడని భావిస్తున్నారు తల్లీ.. పవన్‌కళ్యాణ్ పిచ్చిసేనకి దొరికిన తిక్క సేనాని. అక్కడ ఫ్యాన్స్ అనే భక్తుల మాటలే చెల్లుబాటవుతాయి. మీకు దక్కేవి అవమానాలు, ప్రాణభయాలే. తల్లుల్లారా.. జనసేనకు దూరంగా ఉండండి. అదొక ఉన్మాదపు సేన. అతనో తిక్క సేనాని. మీ జాగ్రత్తలో మీరు ఉండండి.. అని తెలిపాడు.
ఇందులో ముఖ్యాంశం మాత్రం నిజమే. పవన్ ఫ్యాన్స్ రేణుదేశాయ్ తనకో మగతోడు అవసరం ఉందని భావిస్తున్నానని చెప్పిన వెంటనే ఆమెని ఎవరైనా చేసుకోవడానికి వస్తే ముక్కలు ముక్కలుగా నరుకుతాం.. అని బెదిరించినా కూడా పవన్ మౌనం వహించాడే గానీ తన ఫ్యాన్స్ చేసింది తప్పు అని చెప్పకపోవడం గమనార్హం...!