Advertisementt

సై రా కి బాహుబలి టచ్..!

Tue 12th Dec 2017 03:31 PM
keeravani,sye raa movie,mugic director,updates  సై రా కి బాహుబలి టచ్..!
MM Keeravani Mugic to Sye Raa Movie సై రా కి బాహుబలి టచ్..!
Advertisement
Ads by CJ

చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి కొన్ని రోజుల క్రితమే రెగ్యులర్ షూటింగ్ ని మొదలుపెట్టుకుని సెట్స్ మీదకెళ్ళిన సంగతి అందరికి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ ఈ సినిమా ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. అయితే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇంకా మొదలు కాకముందే... సై రా కి సెలెక్ట్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహ్మాన్ తప్పుకోవడంతో.. చిత్ర బృందం డైలామాలో పడిన విషయమూ విదితమే. ఇక సై రా సినిమాని జాతీయస్థాయిలో తెరకెక్కించే నేపధ్యంలో మూవీ కోసం అందరూ టాప్ టెక్నీషియన్స్ ని తీసుకున్నాడు రామ్ చరణ్. 

అంతగా ఆలోచించిన రామ్ చరణ్.... రెహ్మాన్ ఈ ప్రాజెక్ట్ నుంచి వెళ్ళిపోయాక మళ్ళి ఏ మ్యూజిక్ డైరెక్టర్ ని తీసుకుందామా అనే ఆలోచనలో పడ్డాడు. మధ్యలో మోషన్ పోస్టర్ కి బ్యాగ్రౌండ్ ఇచ్చిన థమన్ పేరు తెర మీదకొచ్చినా... ఆతర్వాత థమన్ కి సై రా టీమ్ హ్యాండ్ ఇచ్చేసింది.  ఇదిలా ఉంటే తాజాగా టీం ఇప్పుడు మరొక టాప్ సంగీత దర్శకుడు అయిన కీరవాణి పేరు తెర మీదకు తెచ్చింది. తన సంగీతంతో బాహుబలి వంటి గొప్ప సినిమాకు వెన్నుముకగా నిలిచిన కీరవాణి అయితే సై రా కు న్యాయం చేయగలరని మూవీ టీం భావిస్తుంది అంట. రామ్ చరణ్ ఇప్పటికే కీరవాణి తో ఈ విషయం గురించి మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. మరి అన్ని అనుకున్నట్టు జరిగితే సై రా నరసింహారెడ్డి కి కీరవాణి సంగీతాన్ని అందిస్తాడు.

ఇకపోతే కీరవాణి ప్రస్తుతం చందు - నాగ చైతన్య కలయికలో వస్తున్న  సవ్యసాచి సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.  అలాగే ఫైనల్ గా కీరవాణి సై రా నరసింహారెడ్డికి సంగీత దర్శకుడిగా సెట్ అయినట్టే.. త్వరలోనే సై రా టీమ్ నుండి అధికారిక ప్రకటన వస్తుందంటున్నారు.

MM Keeravani Mugic to Sye Raa Movie:

Chiranjeevi Sye Raa Movie Latest Updates

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ