Advertisementt

రంగస్థలానికి తప్పడం లేదు!

Tue 12th Dec 2017 02:09 PM
ram charan,samantha,rangasthalam,re shoot,sukumar  రంగస్థలానికి తప్పడం లేదు!
Rangasthalam in Re-Shoots రంగస్థలానికి తప్పడం లేదు!
Advertisement
Ads by CJ

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ 'రంగస్థలం' సినిమాలో నటిస్తున్నాడు. తాజాగా విడుదలైన 'రంగస్థలం' సినిమా ఫస్ట్ లుక్ ఇప్పటికే సోషల్ మీడియాలో ఇంకా తెగ హలచల్ చేస్తుంది. ఈ సినిమా ని వచ్చే ఏడాది మార్చ్ 30 న ప్రపంచవ్యాప్తంగా చిట్టిబాబుని కలుసుకోండి అంటూ 'రంగస్థలం' విడుదల డేట్ కూడా ఇచ్చేశారు. అసలైతే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యి... ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. కాని రంగస్థలం సినిమా రీ-షూట్స్ జరుపుకోవడం వల్ల సినిమా షూటింగ్ లేట్ అవుతూ వస్తుంది. మాములుగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందే సినిమాల విషయంలో ప్రతిసారి రీ షూట్స్ జరుగుతాయి అని వార్తలు వినిపిస్తూనే ఉంటాయి.

తనకి అనుకున్న విధంగా సీన్స్  రాలేదని చెప్పి మరో పది పదిహేను రోజులపాటు రీ షూట్స్ కచ్చితంగా చేస్తాడు సుకుమార్ అనే టాక్ ఉంది. తాను తీసే ప్రతి సినిమాకి ఇలాగే రిపేర్లు చేసే సుకుమార్ ఇప్పుడు రామ్ చరణ్ 'రంగస్థలం' కు కూడా అలాగే మెరుగులు దిద్దుతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది. 'రంగస్థలం'లో కూడా పెర్ఫెక్షన్ కోసం సుకుమార్ తాపత్రయపడుతున్నాడని... అందుకే తీసిన సీన్స్ సరిగ్గా వచ్చాయా లేదా అని ఒకటికి పది సార్లు చెక్ చేసుకుంటున్నాడట సుకుమార్. తనకు సంతృప్తిగా అనిపించని సీన్స్ ని మళ్ళీ రీ షూట్స్ చేస్తున్నాడట ఈ లెక్కల మాష్టారు.

అందుకే ఈ సినిమా విడుదల ఆలస్యమవుతు వస్తుందని తెలుస్తుంది. ఈ రీ-షూట్స్ వలన సినిమా బడ్జెట్ కూడా విపరీతంగా పెరిగిపోతుందని టాక్ కూడా ఉంది. అందుకే రామ్ చరణ్ కూడా తన పారితోషకాన్ని తగ్గించుకున్నాడని కూడా ప్రచారం జరుగుతుంది.  మరి ఇప్పటివరకు సుకుమార్ సినిమాల విషయంలో హీరోలు ఇదే ప్రాబ్లెమ్ ఫెస్ చేస్తే.. ఇప్పుడు చరణ్ వంతు అంటున్నారు. ఇకపోతే ఈ సినిమాలో రామ్ చరణ్ చిట్టిబాబు లుక్ కి ఎంతగా పేరొచ్చిందో.. సమంత అమాయకపు లంగావోణీ లుక్ కి అంతే రెస్పాన్స్ వస్తుంది.  ఇకపోతే సమంతా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

Rangasthalam in Re-Shoots :

Ram charan and Sukumar Rangasthalam Latest Updates

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ