అక్కినేని అఖిల్ తన మొదటి చిత్రంగానే ఓ బాలీవుడ్ రీమేక్ చిత్రం చేయాలనే ఆలోచన ఉన్నట్లు విపరీతంగా ప్రచారం జరిగింది. తన మొదటి చిత్రం 'అఖిల్'కి డిజాస్టర్‌గా నిలిచినప్పుడు కూడా తన రెండో చిత్రంగా అదే బాలీవుడ్ చిత్రాన్ని రీమేక్ చేయనున్నట్లు మరోసారి కూడా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా తన ఫేస్‌బుక్ లైవ్‌లో అభిమానులతో ముచ్చటించిన అఖిల్ మాత్రం తనకు రీమేక్ చిత్రాలంటే చాలా భయమని చెప్పాడు. ఇక అఖిల్ స్వతహాగా మంచి క్రికెటర్ ఆన్న విషయం సెలబ్రిటీ క్రికెట్ లీగ్ సమయంలోనే అందరికీ తెలిసిన విషయమే. దాంతో ఓ అభిమాని ఏదైనా క్రీడాకారుడి బయోపిక్ చేయాల్సి వస్తే ఎవరి జీవిత కథను ఎంచుకుంటారని ప్రశ్నించాడు.
దానికి అఖిల్ తనకు అలాంటి చిత్రాలు చేయడమంటే భయమని, ఇక అందరికీ స్ఫూర్తినిచ్చే సచిన్, ధోని, విరాట్‌కోహ్లివంటి వారి చిత్రాలను చేస్తానని అన్నాడు. అయితే తాను భవిష్యత్తులో చేయబోయే సినిమాల గురించి ఇప్పుడు అస్సలు ఆలోచించడం లేదని, తన మనసంతా ప్రస్తుతం 'హలో'పైనే ఉందని చెప్పాడు. తనకు ప్రతి సినిమా ముఖ్యమైనదేనని చెబుతూ, తాను అన్ని ఆహారపదార్ధాలను ఇష్టపడతానని, షూటింగ్స్ సమయంలో మాత్రమే డైట్ ఫాలో అవుతానని, మిగిలిన రోజుల్లో తనకిష్టమైనవన్నీ బాగా తింటానని చెప్పాడు.ఇక తన తండ్రి నటించిన 'శివ' చిత్రం ఎంత పెద్ద విజయం సాధించి ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచిందో అందరికీ తెలిసిన విషయమే. సినిమా చరిత్రలోనే 'శివ' ముందు, 'శివ' తర్వాత అనేంతగా ఆ చిత్రం ఘనవిజయం సాధించింది.
కానీ చిన్నప్పుడు అఖిల్‌కి ఈ చిత్రం అర్ధంకాకపోవడమే కాదు.. సరిగా నచ్చలేదట. ఇప్పటివరకు 22 సార్లు ఆ చిత్రం చూశాను. 16వసారి చూసినప్పుడు కూడా నాకు ఆ చిత్రం అర్ధం కాలేదు. బహుశా ఇప్పుడు అర్ధమవుతుందేమోనని అంటున్నాడు.