తెలుగులో సుమ తర్వాత యాంకర్‌గా పేరుతెచ్చుకున్న వ్యక్తి ఝాన్సీ. సుమ తర్వాత ఝాన్సీ, ఉదయభానులు యాంకర్లుగా మంచి పేరు సంపాదించారు. ఇక సుమ ఎక్కువగా ఎంటర్‌టైన్‌మెంట్ షోలను హ్యాండిల్ చేస్తే, ఝాన్సీ మాత్రం సామాజిక చైతన్యం కలిగించే కార్యక్రమాలను ఎక్కువగా హోస్ట్ చేసేది. ఇక ఈమెకి ఆమె భర్తకి వైవాహిక జీవితంలో కూడా ఎన్నో గొడవలు జరిగి ఆమెని వార్తల్లో నిలిపాయి. నాడు అందరిలో క్రేజ్ తెచ్చుకున్న ఆమె ఓన్‌గా ఓ రికార్డింగ్ థియేటర్‌ని కూడా నెలకొల్పింది. ఈమెకి తన భర్తతోనే కాదు సింగర్ సునీత నుంచి అందరితోనూ పేచీలు పెట్టుకుంటుందనే విమర్శలున్నాయి. ఈమె నటిగా కూడా మారి వెండితెరపై తనకు, తన బాడీలాంగ్వేజ్‌కి తగ్గ పాత్రలు చేస్తూ మెప్పించింది. ముఖ్యంగా నాగార్జున, జగపతిబాబు చిత్రాలలో కనిపించేది.
ఇక ఆమె ఆర్.నారాయణమూర్తి దర్శకత్వంలో ఆయనే నిర్మాత, హీరోగా నటిస్తున్న ఓ చిత్రంలో మంచి పాత్రలో అవకాశం వచ్చింది. ఆర్.నారాయణ మూర్తి సెట్స్‌లో ఎంతో సీరియస్‌గా, కేవలం తన సినిమాల గురించే ఆలోచిస్తూ గంభీరంగా ఉంటాడు. కానీ ఆ చిత్రం షూటింగ్‌లో ఝాన్సీ మాత్రం అందరితో కలిసి ముచ్చట్లాడుతూ, జోకులు వేస్తూ ఉండటంతో ఆమె ప్రవర్తన పీపుల్స్‌స్టార్‌కి నచ్చలేదని ఆమె చెప్పుకొచ్చింది. ఆర్.నారాయణమూర్తి గారు మేము నవ్వుతూ, సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే తనను చూసి ఎగతాళి చేస్తూ తన మీదనే జోక్స్ వేసుకుంటున్నారని భావించి సీరియస్ అయ్యాడని, నిజానికి ఆ చిత్రంలో అన్నయ్య పాత్ర చనిపోతే ఆమె సోదరి ఆ బాధ్యతను తీసుకుని ప్రజలను చైతన్యవంతులని చేసి ఓ భారీ ఫైట్ కూడా చేయాల్సివుందని ఆమె తెలుపుతూ, కానీ నా ప్రవర్తన మూర్తిగారికి నచ్చకపోవడంతో స్క్రిప్ట్‌లో మార్పులు చేసి, అన్నయ్య బతికి వచ్చినట్లు చూపించి, తన పాత్రకు ప్రాధాన్యత లేకుండా చేశాడని, నాలుగురోజులు నన్ను షూటింగ్‌లో వెయిట్ చేయించాడని తెలిపింది.
ఆ తర్వాత తెలంగాణ శకుంతల సెట్లో నుంచి బయటికి వచ్చి క్లైమాక్స్ తీస్తున్నారు. కథ మారింది. అన్నయ్య బతికి వచ్చాడని చెప్పడంతో తాను హర్ట్ అయి ఆ చిత్రంలో నటించకుండా వెళ్లిపోయానని తెలిపింది.