Advertisementt

చరణ్ కి హీరోయిన్ ఫిక్స్ అయ్యిందా !

Mon 11th Dec 2017 02:23 PM
ram charan,boyapati srinu,anupama parameswaran,heroine  చరణ్ కి హీరోయిన్ ఫిక్స్ అయ్యిందా !
Anupama Parameswaran in Ram Charan and Boyapati Film చరణ్ కి హీరోయిన్ ఫిక్స్ అయ్యిందా !
Advertisement
Ads by CJ

ప్రస్తుతం రామ్ చరణ్ రంగస్థలం షూటింగ్ తో పాటు.. తన తండ్రి చిరు సై రా మూవీ నిర్మాతగా బిజీ గా ఉన్నాడు. రంగస్థలం మూవీ షూటింగ్ పూర్తికావొస్తున్న నేపసథ్యంలో రామ్ చరణ్ తన తండ్రి సై రా నరసింహారెడ్డి మూవీ నిర్మాణ బాధ్యతలతో పాటుగా మాస్ డైరెక్టర్ అయిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక మూవీ చెయ్యడానికి సిద్దమవుతున్నాడు. రీసెంట్ గా ఈ మూవీ పూజ కార్యక్రమాలు కూడా జరుపుకుంది. కాకపోతే. జనవరి లో ఈ మూవీ కి సంభందించిన రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతుంది. ఈలోపు బోయపాటి శ్రీను ఈ సినిమాకి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులతోపాటు.... నటీనటుల ఎంపిక కూడా పూర్తి చేయనున్నాడు.

అయితే ఈ మూవీ లో రామ్ చరణ్ కి జోడిగా ముందు రకుల్ ప్రీత్ సింగ్ తెరమీదకి రాగా.. తర్వాత మెగా హీరోయిన్ గా కీర్తింపబడుతున్న అను ఇమ్మాన్యువల్ అన్నారు. దాదాపుగా  హీరోయిన్ గా అను ఇమ్మాన్యువల్ ని చిత్ర బృందం ఎంపిక చేసినట్టుగానే.. సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. అయితే తాజాగా రామ్ చరణ్ పక్కన అనుపమ పరమేశ్వరన్ ని హీరోయిన్ గా సెలెక్ట్ చేసినట్లుగా వార్తలొస్తున్నాయి. మరి అనుపమ, చరణ్ కి జోడి అనే ఈ వార్త నిజమనే సమాచారం అందుతుంది. ఇప్పటికే ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న అనుపమ కి రామ్ చరణ్ పక్కన అవకాశం రావడం మంచి అవకాశం అని చెప్పొచ్చు.

ఇకపోతే బోయపాటి - రామ్ చరణ్ సినిమా ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ తో రెగ్యులర్ షూట్ స్టార్ట్ కాబోతుంది. పీటర్ హెయిన్స్ ఈ మూవీ కి ఫైట్స్ ని సమకూరుస్తున్నాడు. మరి మామూలు హీరోనే మాస్ హీరో గా ఒక రేంజ్ లో చూపించే బోయపాటి శ్రీను, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని ఏ రేంజ్ లో ఎలా చూపిస్తాడో అని తెగ వెయిట్ చేస్తున్నారు మెగా ఫాన్స్.

Anupama Parameswaran in Ram Charan and Boyapati Film :

Ram Charan and Boyapati Srinu Movie Heroine confirmed

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ