Advertisementt

చిరు ఇంటి ముందు ఈ శ్రీదేవి ఎవరు?

Mon 11th Dec 2017 02:19 PM
sridevi,charanjeevi,chiranjeevi house,police  చిరు ఇంటి ముందు ఈ శ్రీదేవి ఎవరు?
Sridevi Loitering Infront of Chiru House చిరు ఇంటి ముందు ఈ శ్రీదేవి ఎవరు?
Advertisement
Ads by CJ

తమ అభిమాన హీరోల కోసం వారి అభిమానులు ఎన్నో విధాలుగా వారిని చూడాలని, వారి కంట్లో పడాలని చూస్తుంటారు. ఇంకొందరు వారి ఇళ్ల ముందు కూర్చుని వారు కారులో వెళ్లేటప్పుడో, వచ్చేటప్పుడో చూసి సంతోషపడుతూ ఉంటారు. మరికొందరైతే హీరోల సెక్యూరిటీలతో గొడవలు కూడా పెట్టుకుంటారు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ మహిళ తాను అతిలోక సుందరి శ్రీదేవిని అని, తాను వచ్చానని చెబితే చిరంజీవి బయటకు వస్తాడని చెప్పి సెక్యూరిటీలో గొడవ పెట్టుకుని ఎంతో సేపు హల్‌చల్‌ చేసింది. 

దాంతో సెక్యూరిటీ కలుగ చేసుకుని ఆమెకి ఎంత సర్ధిచెప్పినా ఆమె అక్కడి నుంచి కదలలేదు. దాంతో జూబ్లీహిల్స్‌ పోలీసులకు సెక్యూరిటీ సిబ్బంది విషయాన్ని తెలియజేయడంతో మహిళా పోలీసులు వచ్చి ఆమెను స్వాదీనంలోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మెగాస్టార్‌, కేంద్రమాజీ మంత్రి, రాజ్యసభ ఎంపీ అయినా చిరంజీవి విషయంలో పొంతనలేని మాటలు చెప్పడంంతో ఆమెకి మతిస్థిమితం లేదని నిర్ధారణకు వచ్చిన పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది చివరకు ఎలాగోలా ఆమె బంధువుల సమాచారాన్ని సేకరించి, వారికి ఫోన్‌ చేసి రప్పించి, ఆమెని వారికి అప్పగించారు. ఈ వార్త తాజాగా హైదరాబాద్‌లో సంచలనం సృష్టించింది. ప్రస్తుతం చిరంజీవి 'సైరా.. నరసింహారెడ్డి' చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. 

Sridevi Loitering Infront of Chiru House:

Woman's hulchul infront of Chiranjeevi's house

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ