రామ్ చరణ్ - బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సినిమా అని గత ఏడాది నుండే వార్తలొచ్చిన్నప్పటికీ.. ఆ విషయాన్ని పెద్దగా ఎవరు నమ్మలేదు. కానీ ఈమధ్యనే చరణ్ - బోయపాటి సినిమా ఎట్టకేలకు స్టార్ట్ అయ్యింది. తాజాగా పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా త్వరలో రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళబోతుందనే సమాచారం వుంది. అయితే బోయపాటి చెప్పిన కథ రామ్ చరణ్ కు నచ్చడంతో బోయపాటి దర్శకత్వంలో సినిమా చెయ్యడానికి చరణ్ వెంటనే ఒప్పుకున్నాడు. చరణ్ అలా ఒకే చేసాడో లేదో ఇలా సినిమా ప్రారంభోత్సవం కూడా జరుపుకుంది.
అయితే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవ్వడానికి ఇంకా సమయం ఉంది కాబట్టి ఈలోపు కథ విషయంలో కొన్ని మార్పులు చేర్పులు చేయమని బోయపాటి శ్రీను కి రామ్ చరణ్ సలహా ఇచ్చాడట. రామ్ చరణ్ ఇలా సలహా ఇవ్వడంతో బోయపాటి ఒక్కసారిగా షాక్ కి గురయ్యాడని టాక్ వినబడుతుంది. కథ చెప్పినప్పుడు బావుందని ఓకే చేసిన రామ్ చరణ్ ఇప్పుడేమో స్క్రిప్ట్ లో మార్పులు చేయమనడం ఏమిటి బోయపాటి అని తల పట్టుకుంటున్నాడట. మరి బోయపాటి శ్రీను, బాలకృష్ణతో చేసిన సింహా, లెజెండ్ రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ లు అయ్యాయి. అంతేకాదు అల్లు అర్జున్ తో చేసిన సరైనోడు అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.
కాకపోతే... బోయపాటి, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో చేసిన జయ జానకి నాయక సినిమా మాత్రం యావరేజ్ గా నిలిచింది. భారీ బడ్జెట్ తో చేసిన ఆ సినిమా యావరేజ్ కావడంతో రామ్ చరణ్ ఇప్పుడు తన సినిమా కోసం ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. అందుకే స్క్రిప్ట్ విషయంలో బోయపాటికి సలహా ఇస్తున్నాడట రామ్ చరణ్. మరి చరణ్ చెప్పిన సలహాలు బోయపాటి పాటిస్తాడో లేదో తెలియదు గాని.. జనవరిలో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ తో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుందని అంటున్నారు.