ఇటీవలే అమృత అనే యువతి తానే జయలలిత, శోభన్‌బాబులకు పుట్టిన పాపని అని ముందుకు వచ్చి డీఎన్‌ఏ పరీక్షలకు కూడా సై అని చెప్పింది. ఇక జయకి పాప ఉన్నది నిజమేనని, జయ తల్లే ఆమె భర్తని విషమిచ్చి చంపిందని, జయకి తన పెద్దమ్మే పురుడు పోసిందని జయ మేనత్త వెల్లడించింది. ఇక తాజాగా జయ వైద్యం కోసం ప్రభుత్వం నియమించిన వైద్యబృందం విచారణ కమిషన్ ఎదుట నివ్వెరపోయే వాస్తవాలను వెల్లడించింది. జయ మరణంపై ప్రతిపక్షాలు, ఆమె అభిమానులు వ్యక్తం చేస్తున్న అనుమానాల విచారణ కోసం తాజాగా మద్రాస్‌హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ముగం ఆధ్వర్యంలో ప్రస్తుతం ఈ నిజనిర్దారణ బృందం జయ మరణానికి సంబంధించిన విషయాలను పలువురి నుంచి సేకరిస్తోంది.
ఇప్పటికే ఈ విచారణ కమిటీ ముందు 27మంది జయకి సంబంధించిన వివారాలపై వాంగ్మూలం ఇచ్చారు.ఇక తాజాగా ఆమెకి చికిత్స చేసిందని భావిస్తున్న ప్రభుత్వం నియమించిన వైద్యబృందం తాము జయలలితకు అసలు చికిత్సే చేయలేదని, ఆమె వేరే రూమ్‌లో ఉంటే తమను మరో గదిలో ఉంచారని, ఉదయం వెళ్లి, సాయంత్రం దాకా ఓ గదిలో మేమందరం కాలక్షేపం చేసి సాయంత్రం ఇళ్లకు వెళ్లేవారిమని, తమను ఆమె చికిత్సకు అసలు అనుమతించలేదనే వాస్తవాన్ని బయటపెట్టారు.
ఇక జయ మరణం గురించి త్వరలో ఆమె మేనకోడలు దీప, ఆమె సోదరుడు, ఆక్యుపెంచర్ వైద్యుడు, నాటి ప్రభుత్వ మాజీ సీఎస్ షీలా బాలకృష్ణన్, మాజీ ప్రభుత్వ కార్యదర్శి రామ్మోహన్‌రావు తదితరులు కూడా విచారణ కమిటీ ముందు హాజరుకానున్నారు.