Advertisementt

'అజ్ఞాతవాసి', 'జై సింహ' మ్యాటరేంటి..!

Sun 10th Dec 2017 11:56 PM
balakrishna,pawan kalyan,agnathavasi,jaisimha,sankranthi war  'అజ్ఞాతవాసి', 'జై సింహ' మ్యాటరేంటి..!
Pawan Agnathavasi VS Balayya Jai Simha 'అజ్ఞాతవాసి', 'జై సింహ' మ్యాటరేంటి..!
Advertisement
Ads by CJ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్నంత క్రేజ్ ఏ హీరోకి లేదనేది జగమెరిగిన సత్యం. పవన్ తాజాగా నటించిన చిత్రం 'అజ్ఞాతవాసి'. పవన్ కళ్యాణ్ గత చిత్రాలు 'సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు' డిజాస్టర్లయినప్పటికీ 'అజ్ఞాతవాసి'పై ఆ ప్రభావం ఏమీ పడలేదు. పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్ అనగానే ఈ మూవీపై అందరిలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా ఫస్ట్ సాంగ్, ఫస్ట్ లుక్, కొన్ని ఫొటోలు రిలీజయ్యాక ఈ సినిమాపై హైప్ మరింత పెరిగిపోయింది. అసలు 'అజ్ఞాతవాసి'కి సంబందించిన ఏ ఒక్క విషయం బయటికి వచ్చిన అది క్షణాల్లో సోషల్ మీడియాలో టాప్ ట్రేండింగ్ లోకి వెళ్ళిపోయుంది.

ఇంత భారీ అంచనాలు ఉన్న 'అజ్ఞాతవాసి' మూవీ సంక్రాంతికి రిలీజ్ అవ్వబోతుంది. సినిమా విడుదలకు ఒక నెల ముందే ఆ సినిమా హంగామా ఇలా ఉంటే..  ఇక సంక్రాంతి టైం కి పవన్ కళ్యాణ్ హంగామా మాములుగా ఉండదు అని అర్ధం అయిపోతుంది. మరి పవన్ 'అజ్ఞాతవాసి' అంత గ్రాండ్ లెవల్లో విడుదలకు సిద్ధమవుతుంటే... అదే సమయానికి  అంటే సంక్రాంతికి బాలకృష్ణ తన 102 వ సినిమా అయిన 'జై సింహ' ని కూడా రిలీజ్ చేస్తున్నాడు. అయితే కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై పెద్దగా అంచనాల్లేవు. కె.ఎస్.రవికుమార్ లాంటి ఫామ్‌లో లేని సీనియర్ డైరెక్టర్‌ తీస్తున్న సినిమా ఇది. 

అందుకే ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ఏవీ కూడా అంతగా ఎగ్జైట్ కలిగించట్లేదు. మాములుగా అయితే బాలయ్య సినిమాకి సంబందించిన ఏ ఒక్క విషయం బయటికి వచ్చినా బాలయ్య ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చేసేవి. అలాగే అసలు ఈ 'జై సింహ'కి  కథ అందించిన రత్నం కూడా ఇప్పుడు ఫాంలో లేడు. మరి ఇన్ని నెగటివ్ పాయింట్స్ ఉన్న బాలయ్య సినిమా పవన్ కళ్యాణ్ సినిమా ముందు తట్టుకోగలదా అనే సందేహం కలుగుతుంది ఇప్పుడు. కనీసం బాలయ్య సినిమాకి థియేటర్స్ అయినా దొరుకుతాయో లేదో అనే అనుమానంలో ట్రేడ్ వర్గాలున్నాయంటున్నారు. 

Pawan Agnathavasi VS Balayya Jai Simha:

Sankranthi War Between Pawan and Balayya  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ