తాజాగా పవన్‌కళ్యాణ్ అల్లుఅరవింద్ విషయంలో 'ప్రజారాజ్యం' పార్టీలో నాడు చోటుచేసుకున్న పరిణామాలపై తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. ఆనాడు అన్ని అల్లుఅరవిందే నడిపించాడని ఎన్నో విమర్శలు వచ్చాయి. పవన్ వ్యాఖ్యలు కూడా అవి నిజమేనని నిరూపించాయి. నాడు చిరంజీవికి పవన్‌ని ఫలానా ప్రాంతంలో ప్రచారానికి పంపమని తన అన్నయ్య చిరంజీవికి ఓ వ్యక్తి చెబితే పక్కనే ఉన్న అల్లుఅరవింద్ పవన్ అవసరం లేదు లేండి. అల్లుఅర్జున్, రామ్‌చరణ్‌లు చాలు అన్నాడట. అంటే అల్లు తనని కూడా సామాజిక స్పృహ ఉన్న నాయకునిగా కాకుండా తన కొడుకు, తన మేనల్లుడు కేవలం ఓ హీరోగానే చూశాడని, దాంతో నేనేమి చేయలేని నిస్సహాయ పరిస్థితిలో మదనపడ్డానని పవన్ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.
దీనిపై కత్తి మహేష్ స్పందిస్తూ, ఏడవడం తప్పు కాదు పవన్‌కళ్యాణ్. కానీ చేతగాక, చెప్పుకోలేక ఏడవడం తప్పు. ఆ విషయం ఇప్పుడు చెప్పి మరీ అల్లుఅరవింద్‌పై ఏడవడం మరీ తప్పు అని సెటైర్లు వేశాడు. దానిపై గీతాఆర్ట్స్‌లోని కీలక వ్యక్తుల్లో ఒకరైన బన్నీ వాస్ దీనిపై స్పందిస్తూ.. అయ్యబాబోయ్.. ఫ్యామిలీలో పుల్లలు పెట్టే పనులు చేయకు. పవన్ ఏమన్నారో మాకు తెలుసు. దాని అర్ధం ఏమిటో కూడా మాకు తెలుసు. కందకి లేని దురద 'కత్తి'కి ఎందుకు? అంటూనే బజారులో కత్తి, సుత్తిలు బాగానే అమ్ముతారని వ్యంగ్యంగా స్పందించాడు. ఇక కత్తి మహేష్ నాడు పవన్ ప్రధాని మోదీకి మద్దతు ఇవ్వడంపై కూడా కత్తి మహేష్ విమర్శలు చేశాడు. నరహంతకుడైన మోదీని సపోర్ట్ చేయడం తప్పు అని చెప్పిన అభిమానిని తిట్టావు. మతోన్మాది, వేలాది ప్రాణాలను తీసిన నరహంతకుడైన మోదీకి నువ్వు సపోర్ట్ చేయడమంటే నీవెంత ఉన్మాద స్థితిలో ఉన్నావో అర్ధమవుతోందని మోదీపై తీవ్ర ఆరోపణలు చేశాడు.
దాంతో తెలంగాణ బిజెపి ఎంపీ ఓ దేశప్రధానిని పట్టుకుని మతోన్మాది, నరహంతకుడు అనడంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. త్వరలో పోలీసులను కలిసి ఆయనపై కేసు పెడతానని చెప్పాడు. ఈ వ్యాఖ్యలపై హైదరాబాద్ పోలీస్‌లు కూడా సీరియస్‌గానే ఉన్నారు. దీంతో కత్తి మహేష్‌ని త్వరలో అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు.