ప్రస్తుతం మంచు విష్ణు ఎంతో బిజీగా ఉన్నాడు. ఓ వైపు ఆయన తండ్రి మంచు మోహన్‌బాబు 'పెళ్లైన కొత్తల్లో' ఫేమ్ మదన్ దర్శకత్వంలో నాటి 'అసెంబ్లీరౌడీ' వంటి పక్కా పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే 'గాయత్రి' అనే చిత్రం చేస్తున్నాడు. ఇందులో మంచు విష్ణు కూడా కీలకపాత్రలో నటిస్తుండగా, సీనియర్ హీరోయిన్ శ్రియాశరణ్‌తో పాటు యాంకర్, నటి అనసూయ జర్నలిస్ట్ పాత్రలో, నిఖిలా విమల్ మోహన్‌బాబు కుమార్తెగా నటిస్తోందని సమాచారం. ఈ చిత్రాన్ని మోహన్‌బాబు సొంత బేనర్ అయిన శ్రీలక్ష్మీప్రసన్న పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. మరోవైపు మరో పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో మంచు విష్ణు ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో 'ఓటర్' అనే చిత్రం చేస్తున్నాడు. దీని ఫస్ట్‌లుక్ పోస్టర్స్‌కి విపరీతమైన స్పందన వచ్చిన సంగతి తెలిసిందే.
ఇక గతంలో 'దేనికైనారెడీ' 'ఈడోరకం ఆడోరకం' వంటి రెండు హిట్‌చిత్రాలను మంచు విష్ణుకి అందించిన కామెడీ చిత్రాల దర్శకుడు జి.నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో మంచు విష్ణు, బ్రహ్మానందం ముఖ్యపాత్రల్లో, ప్రగ్యాజైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న మరో కామెడీ ఎంటర్‌టైనర్ 'ఆచారి అమెరికా యాత్ర' చిత్రం కూడా చేస్తున్నాడు. దాదాపు షూటింగ్‌ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 26న రిపబ్లిక్‌డే కానుకగా విడుదల కానుంది.
ఇలా ఒకేసారి మూడు చిత్రాలలో నటిస్తున్న మంచు విష్ణు తాజాగా తాను తన తండ్రితో నటిస్తున్న 'గాయత్రి' చిత్రంలోని రావణాసురుడి గెటప్‌లో పది తలలతో కనిపిస్తుండగా, ఆ రావణాసురుడి తలను ప్రేమతో గడ్డం పట్టుకున్న శ్రియాశరన్ కలిసి దిగిన ఫొటోని సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ పోస్టర్ ఎంతో ఫన్నీగా ఉంటూనే పలు రకాలుగా సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.