ప్రభాస్ హీరోగా 'బాహుబలి' సీరీస్ తరువాత నటిస్తున్న సినిమా 'సాహో'. 'రన్ రాజా రన్' ఫేం సుజీత్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తుండగా యువి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ ప్రమోద్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అయితే ఎప్పుడో షూటింగ్ ని స్టార్ట్ చేసుకున్న ఈ సినిమా రీసెంట్ గా ఫస్ట్ షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకుంది. త్వరలో దుబాయ్ లో ఒక భారీ షెడ్యూల్ కి ప్లాన్ చేస్తుంది 'సాహో' టీమ్. భారీ బడ్జెట్ తో భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కేవలం ఆరు నెలల్లో కంప్లీట్ చేసి విడుదల చేస్తారనే ప్రచారం జరిగింది.
కానీ ఈ మధ్యన ప్రభాస్ 'సాహో' సినిమాని వచ్చే ఏడాది దసరా కానుకగా రిలీజ్ చేస్తారు అనే వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఈ సినిమా వచ్చే ఏడాది కాకుండా 2019 లో రిలీజ్ అవుతుందనే సమాచారం అందబోతుంది. ఈ సినిమా షూటింగ్ నత్తనడకన సాగుతుందనే టాక్ వినబడుతుంది. అయితే భారీ తారాగణం నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇలా లేట్ అవడానికి కారణం కేవలం ఒక బాలీవుడ్ స్టార్ నటుడు అంటున్నారు. ఆ బాలీవుడ్ నటుడు లేట్ చెయ్యడం వల్లే ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ లేట్ అవుతుందట.
అయితే ఈ సినిమా షూటింగ్ కి ఇబ్బందిగా మారిన ఆ బాలీవుడ్ నటుడు ఎవరు అనేది ఇంకా తెలియరాలేదు. ఎందుకంటే 'సాహో' సినిమాలో బాలీవుడ్ నటీనటులు చాలామందే నటిస్తున్నారు. విలన్స్ దగ్గరనుండి హీరోయిన్ వరకు బాలీవుడ్ వాళ్ళే. ఇకపోతే ప్రభాస్ సరసన శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నీల్ నితిన్ ముకేష్ మెయిన్ విలన్ గా నటిస్తున్నాడు.