ఈనెల క్రిస్మస్ సీజన్ సందర్భంగా లాంగ్ వీకెండ్‌ని దృష్టిలో పెట్టుకుని 21వ తేదీన దిల్‌రాజు-నాని-సాయిపల్లవిల 'ఎంసీఎ' (మిడిల్‌క్లాస్ అబ్బాయి) రానుండగా, నాగార్జున నిర్మాతగా ఇంటిలిజెంట్ డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో నాగ్ చిన్నకుమారుడు అఖిల్‌కి రీలాంచ్‌గా భావిస్తున్న 'హలో' 22వ తేదీన విడుదల కానుంది. అటు దిల్‌రాజుకి, ఇటు నాగార్జునకి సినిమాలపై, వాటి విజయంపై, ప్రమోషన్స్ ద్వారా ఓపెనింగ్ తెచ్చుకోవడం వంటి విషయాలలో, మేకింగ్‌పై కూడా మంచి జడ్జిమెంట్ ఉంది. ఇక నాని విషయానికి వస్తే ఆయన తనకు సరిగ్గా సూటయ్యే స్టోరీలనే ఎంచుకుంటూ ట్రిపుల్ హ్యాట్రిక్ వైపు దూసుకెళ్తున్నాడు.
ఇక మిడిల్ క్లాస్ అబ్బాయిగా అయితే నాని కరెక్ట్‌గా మన పక్కింటి అబ్బాయి అనిపించేలా జీవిస్తాడని ఖచ్చితంగా చెప్పవచ్చు. మరోవైపు ఈ చిత్రానికి 'ఫిదా' బ్యూటీ సాయిపల్లవి మరింత నిండుదనం తేనుంది. అదే 'హలో' విషయానికి వస్తే ఈ చిత్రం పోస్టర్స్ నుంచి టీజర్, ట్రైలర్, సాంగ్‌ప్రోమోలన్నీ ఆకట్టుకున్నాయి. ఇక ట్రైలర్‌లో కళ్యాణి ప్రియదర్శన్ కూడా ఆకట్టుకోవడమే కాదు.. రమ్యకృష్ణ, జగపతిబాబు వంటి భారీ క్యాస్టింగ్‌ఉంది. మరోవైపు ఈ రెండు చిత్రాలకు ఇండస్ట్రీలోనే కాదు... బిజినెస్ సర్కిల్స్‌లో, ప్రేక్షకుల్లో కూడా పాజిటివ్ బజ్ ఏర్పడింది. నాని అఖిల్‌పై పోటీ విషయంపై స్పందిస్తూ తామిద్దరం పోటీ పడటం లేదని, మేమిద్దం కలిసి సల్మాన్‌ఖాన్ 'టైగర్ జిందాహై'తో పోటీ పడుతున్నామని చెప్పేశాడు. దిల్‌రాజుకి నాగ్, విక్రమ్‌ల ప్రతిభ తెలుసు కాబట్టి ఆయన 'హలో చిత్రంకి ఆల్‌దిబెస్ట్'. ఈ రెండు చిత్రాలు విజయవంతం కావాలని కోరుకుటున్నట్లు చెప్పాడు.
మరో వైపు నాని క్రేజ్ తనకు తెలుసునని చెప్పిన నాగ్ ఆ చిత్రం బాగా ఆడాలని పాజిటివ్‌గా స్పందించాడు. ఇక 'హలో' చిత్రంలో ఔటర్‌రింగ్ రోడ్డులో తీసిన యాక్షన్ సీన్స్, కృష్ణానగర్‌లోని బిల్డింగ్‌ల మీద నుంచి బిల్డింగ్‌ల మీదకి దూకే ఫైట్ జాకీచాన్ సినిమాలలోని ఫైట్స్ తరహాలో కామెడీగానే ఉంటూ ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంటుందట. మరోవైపు హైదరాబాద్ మెట్రో ప్రారంభానికి ముందే అక్కడ తీసిన 'హలో'లోని యాక్షన్ సీన్స్ కూడా హైలైట్ కానున్నాయని తెలుస్తోంది. ఈ పోటీలో ఇద్దరు సమ ఉజ్జీలుగా నిలుస్తారా? లేదా? అనేది వేచిచూడాల్సివుంది..!