Advertisementt

నెటిజన్లపై ఆదా కోపంలో అర్ధముంది!

Sun 10th Dec 2017 03:59 PM
adah sharma,netizen,kiss,harassment,heroine  నెటిజన్లపై ఆదా కోపంలో అర్ధముంది!
Adah Sharma Serious on Netizen నెటిజన్లపై ఆదా కోపంలో అర్ధముంది!
Advertisement
Ads by CJ

సినిమాలకు, నిజజీవితానికి మనం ఎప్పటికి తేడా తెలుసుకుంటామో అర్ధం కాని పరిస్థితి. అభిమానం హద్దులు మీరి గుళ్లుగోపురాలు కట్టేస్తూ మా హీరోనే మాకు దైవం అంటూ ప్రాణాల మీదకు తెచ్చుకునే ఫ్యాన్స్‌.. ఇతర హీరోలతో గొడవల్లో ప్రాణాలు పొగొట్టుకుంటున్నవారు కూడా ఉన్నారు. హీరోలు అందరు కలిసే ఉంటారు. మరి ఈ అభిమానం పేరుతో ఫ్యాన్స్‌ చేసే చేష్టలు చూస్తే ఆశ్చర్యం వేయకమానదు. దానిని అభిమానం అనే కంటే పిచ్చి అభిమానం అనే పదం కూడా తక్కువే. పోర్న్‌ సినిమాలలో నటించిందని సన్నిలియోన్‌ను ఓపెన్‌గా సెక్స్‌ చేయమంటే ఎలా? పూర్వకాలంలో కేవలం అజ్ఞానం వల్ల కొందరు రాముడు, శ్రీకృష్ణుడు వంటి దేవుళ్ల పాత్రలో చేసిన వారిని, సీతాదేవి, ద్రౌపది, సతీసావిత్రి వంటి పాత్రలు చేసిన వారిని నేరుగా చూసినప్పుడు వారికి పూల వర్షం కురిపించి, అందరూ భక్తిగా కాళ్లకు మొక్కేవారు. దానికి 'లవకుశ'లో రాముడు, సీతగా నటించిన ఎన్టీఆర్‌, అంజలీదేవిలే సాక్ష్యం. నాడు ప్రేక్షకులు వారిని చూస్తే కాళ్లకు నమస్కారం చేసి ఆశీస్సులు తీసుకునేవారు. 

కానీ ఇంత టెక్నాలజీ, చదువులు పెరిగిన తర్వాత అందులోనూ ఎంతో ఎడ్యూకేటెడ్‌ అయిన నెటిజన్లు కొందరి ప్రవర్తన చూస్తే దారణంగా ఉంటోంది. దానికి తాజా ఉదాహరణ హీరోయిన్‌ ఆదాశర్మ విషయంలో జరిగిన సంఘటన. ఇటీవల ఆమె ముంబై ఎయిర్‌పోర్ట్‌లో దిగితే ఓ వ్యక్తి వచ్చి 'నేను నీ తండ్రి వంటి వాడిని. నాకు ఓ ముద్దివ్వు' అని అడిగాడు. షాక్‌ తిన్న ఆదాశర్మ నవ్వుతూ వెళ్లిపోతుంటే సినిమాలలో హీరోలకు ముద్దిస్తావు గానీ నాకు ఇవ్వవా అని గొడవ చేశాడు. దాంతో కొందరు దానిని వీడియో తీసి సోషల్‌మీడియాలో పెట్టారు. దాంతో ఓ నెటిజన్‌ ఏం.. సినిమాలలో ముద్దిస్తావు.. ఓ అభిమాని ముద్దడిగితే ఇస్తే నీ సొమ్మేం పోయింది అని కామెంట్‌ చేశాడు. దాంతో ఎప్పుడు కూల్‌గా ఉండే ఆదాశర్మకి విపరీతమైన కోపం వచ్చింది. 

సినిమా అంటే నటన. అంతేగానీ ముక్కుమొహం తెలియని వారికి ముద్దిస్తే ఏముంది? చిన్న విషయమే కదా.. అంటున్నారు. అసలు నా దృష్టిలో ఏది చిన్నవిషయం? ఏది పెద్ద విషయం అనేది నిర్ణయించడానికి మీరెవ్వరు? నేను సినిమాలలో ఒకలా ఉంటాను. బయట నా బిహేవియర్‌, దుస్తులు వంటివన్నీ సినిమాలోలాగా ఉండవు. నేను పురుషులను, మగాళ్లను గౌరవిస్తాను. నా తండ్రి, తాతయ్య, నాతో సినిమాలు తీసిన డైరెక్టర్లు, తోటి నటీనటులంటే నాకు చాలా గౌరవం. 'హార్ట్‌ఎటాక్‌' 'కామాండో 2'లలో ముద్దులు ఇచ్చినంత మాత్రాన నిజజీవితంలో కూడా అలాగే ఉంటామా? నన్ను ఎవరైనా ముద్దు అడిగితే చెప్పుతో కొడతా..అని ఘాటుగా రిప్లై ఇచ్చింది. ఇంకా నయం.. ఆదా కాబట్టి ఎయిర్‌పోర్ట్‌లో నవ్వు తెచ్చుకుని వెళ్లిపోయింది. అదే ఇంకొకరైతే అక్కడే చెప్పు తీసుకొని కొడతారు...! అభిమానుల తీరు విపరీత పోకడలు పోతుండటానికి ఇదో నిదర్శనమని చెప్పాలి. 

Adah Sharma Serious on Netizen:

Heroine Adah Sharma Warning to Harassment Person   

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ