జర్నలిజంలో ఒక ముఖ్యాంశం ఉంది. ఇక కార్పొరేటర్, కౌన్సిలర్ స్థాయి వ్యక్తి కేవలం ఆ నగర ఎమ్మెల్యే లేదా మేయర్, మున్సిపల్ చైర్మన్ మీద మాత్రమే విమర్శలు చేస్తే దానిని వార్తగా పరిగణించాలి. కానీ గల్లీ నాయకులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్ వంటి వారు ఏకంగా ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రులు వంటి వారిపై విమర్శలు చేస్తే దానిని వార్తగా ప్రచురించకూడదు. ఏ స్థాయి వారు ఆ స్థాయి వారితోనే చర్చకు సిద్దమని చెప్పాలి. కానీ ఫిల్మ్‌క్రిటిక్‌గా చెప్పుకుంటున్న కత్తి మహేష్ ధోరణి చూస్తే మాత్రం అనుమానాస్పదంగానే ఉంది. ఏదైనా విషయం, విమర్శ చేయాల్సి వస్తే ఒకటి రెండు సార్లు, అది కూడా సూటిగా, స్పష్టంగా విమర్శ చేసి, హాలీవుడ్ చిత్రంలా ఒక గంటా ఒకటిన్నర గంటలో పూర్తి చేయాలి. కానీ మహేష్ కత్తి వాలకం చూస్తుంటే ఈయన ఛానెల్స్‌లో వచ్చే డైలీ మెగా సీరియల్‌లాగా వేలాది ఎపిసోడ్స్‌తో సాగదీస్తున్నట్లు ఉంది. పొగడ్త అయినా విమర్శ అయినా ఒకటి రెండుసార్లు చేస్తే అది బాగా ఉంటుంది.
అలాగని తనమీద ఎవరో ఏదో అన్నారని అదే పనిగా రోజూ విమర్శలే పెట్టుకుంటే అవి ఎబ్బెట్టుగా అనిపిస్తాయి. నిజానికి మొదట కత్తిమహేష్ పవన్ ఫ్యాన్స్‌పై చేసిన విమర్శలు, ఆరోపణలు నిజమే. పవన్ ఫ్యాన్స్ పోకడ విపరీతంగా ఉంది. దాని విషయంలో ఫ్యాన్స్‌ని తప్పుపట్టాల్సిందే. కానీ ఇప్పటిదాకా మహేష్ విషయంలో పవన్ పెద్దగా స్పందించలేదు. కాబట్టి కత్తిమహేష్ పవన్ అభిమానుల విపరీత ధోరణులపై విమర్శలు చేస్తే బాగుంటుంది. అంతేకానీ ప్రతి విషయంలోనూ పవన్‌నే టార్గెట్ చేయడం సమంజసం కాదు...! ఇక ఆయన తాజాగా మాట్లాడుతూ, 'కాటమరాయుడు' చిత్రం విషయంలో నేను స్పందించిన విధానంపై పవన్ అభిమానులు మండిపడ్డారు. మా దేవుడిని అంత మాట అంటావా? అని నాపై అప్రజాస్వామికమైన దాడి చేశారు. ఇలా పవన్ ఫ్యాన్స్ నాడు నా వెంట పడితే ఇప్పుడు నేను పవన్ వెంట పడుతున్నాను.
ఇక పవన్‌ని 'అజ్ఞానవాసి' అనడంలో తప్పులేదు. ఆయన అజ్ఞానం ఆయన మాటల్లోనే కనిపిస్తోంది. ఆయన ఎక్కడా మేధావితనంగా మాట్లాడటం లేదు. కావాలంటే చర్చకి పిలిస్తే ఆయన మేధావి తనం నాకు కూడా అర్ధమవుతుంది అన్నాడు. అయిన మనం ఇక్కడ కూర్చొని మోడీ పాలన బాగా లేదు. నోట్లరద్దు, జీఎస్టీ విషయంలో ఆయన తప్పు చేశాడు. కావాలంటే నాతో వచ్చి చర్చిస్తే చూస్తాను.. అనడం ఎంతో సిల్లీగా ఉంటుంది. అలాగే మహేష్‌కత్తి చెప్పినట్లు పవన్ వచ్చి ఆయనతో చర్చ చేస్తే ఆయన మేధావితనం ఏమిటో ఈ మే'తావి' తెలుసుకుంటాడట.. ఇవేమైనా జరిగే పనులేనా కత్తి...?