Advertisementt

హోలీ ఆడుతున్న హీరో హీరోయిన్!

Sat 09th Dec 2017 10:46 PM
vijay devarakonda,mehrene,holy pic,social media  హోలీ ఆడుతున్న హీరో హీరోయిన్!
Vijay Devarakonda and Mehrene Holy pic హోలీ ఆడుతున్న హీరో హీరోయిన్!
Advertisement
Ads by CJ

సింగిల్ నైట్ లో స్టార్ డమ్ సంపాదించుకున్నాడు అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ. ఇతనికి ఎంత క్రేజ్ ఏర్పడిందో చెప్పాల్సిన పని లేదు. అర్జున్ రెడ్డి సినిమా క్రేజ్ తో ఈ హీరో వరసబెట్టి సినిమాలు తీస్తున్నాడు.

మరోవైపు సినిమాలు మీద సినిమాలలో నటిస్తూ వెళ్ళిపోతుంది హీరోయిన్ మెహ్రీన్. విజయ్ - మెహ్రీన్ ఇద్దరు కలిసి రంగురంగుల హోళీ జరుపుకుంటున్న ఓ స్టిల్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అయింది. అసలు వీళ్లిద్దరు ఎప్పుడు సినిమా స్టార్ట్ చేశారో కూడా ఎవరికి తెలీదు. నిజానికి విజయ్ దేవరకొండ ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు ఇందులో కన్నడ భామ రష్మిక మందన నటిస్తోంది అని తెలిసిన విషయమే.

పరశురాం చిత్రంతో పాటు విజయ్ రాహుల్ సాంక్రిత్యన్ దర్శకత్వంలో రూపొందుతున్న మరో చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్ ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. మరి మెహ్రీన్.. పరశురాం సినిమాలో సెకండ్ హీరోయినా.. లేదా రాహుల్ సాంక్రిత్యన్ దర్శకత్వంలో వస్తున్న సినిమాకు మెయిన్ హీరోయినా అనేది మాత్రం క్లారిటీ లేదు.

Vijay Devarakonda and Mehrene Holy pic:

Vijay Devarakonda and Mehrene Pic sensation in Social Media  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ