ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమాతో సెట్స్ మీదున్నాడు నాగార్జున. నాగార్జున - వర్మ కాంబినేషన్ లో ఇది నాలుగో సినిమా. దాదాపు 27 ఏళ్ల గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ఆసక్తితో పాటే మంచి క్రేజ్ కూడా వుంది. భారీ గ్యాప్ తర్వాత వస్తున్న ఈ ప్రాజెక్టుపై అంచనాలు కాస్త పెరిగాయి. ఆ అంచనాలకు తగ్గట్టే ఈ సినిమాపై గాసిప్స్ కూడా ఎక్కువైపోయాయి. అవేమిటంటే.. ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారని కొందరు పుకార్లు పుట్టించారు.
సిస్టమ్ అనే టైటిల్ నాగ్ - వర్మ సినిమాకి పెట్టారంటూ వార్తలు కూడా వచ్చేశారు. అయితే ఎట్టకేలకు దీనిపై క్లారిటీ ఇచ్చాడు నాగార్జున. తన చిన్న కొడుకు అఖిల్ హలో సినిమాని నిర్మించిన నాగార్జున.. ఆ సినిమా విడుదలకు దగ్గరవడంతో.. ఆ సినిమా ప్రమోషన్స్ తో బాగా బిజీగా వున్నాడు. హలో ప్రమోషన్స్ లో భాగంగానే నాగార్జున తన సినిమా గురించిన విశేషాలు కూడా మీడియాతో పంచుకున్నాడు. తన సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదని ప్రకటించిన నాగార్జున... వర్మ దర్శకత్వంలోని తన సినిమా అప్ డేట్స్ ను మీడియాతో పంచుకున్నాడు.
వర్మతో సినిమా చాలా బాగా వస్తోంది.. వెరీ హ్యాపీ అని చెప్పిన నాగ్ కొత్త షెడ్యూల్ జనవరిలో స్టార్ట్ అవుతుందని... అలాగే సినిమాని ఏప్రిల్ లో రిలీజ్ చేస్తామని చెబుతున్న నాగార్జున ఈ సినిమాకి టైటిల్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు అని క్లారిటీ ఇచ్చాడు.