చిరు సై రా నరసింహారెడ్డిని అధికారికంగా ప్రకటించిన సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహ్మాన్ తప్పుకున్నాడు. అయితే ఇప్పటివరకు ఏ ఆర్ రెహ్మాన్ స్థానాన్ని ఏ సంగీత దర్శకుడితో భర్తీ చెయ్యలేదు నిర్మాత రామ్ చరణ్, దర్శకుడు సురేందర్ రెడ్డిలు. అయితే అలా ఏ ఆర్ రెహ్మాన్ తప్పుకున్నాడనగానే.. ఆ ప్లేస్ లో సై రా నరసింహారెడ్డి కి మోషన్ పోస్టర్ ని రెడీ చేసిన ఎస్ ఎస్ థమన్ కి దక్కుతుందని దాదాపుగా అందరూ ఫిక్స్ అవడమే కాదు... అటు థమన్ కూడా ఆశపడ్డాడు. అలాగే చాలామంది బ్యాగ్రౌండ్ స్కోర్ ఇవ్వడంలో థమన్ తర్వాతే ఎవరైనా అని.. అందుకే సై రా కి థమన్ కి తప్పక అవకాశం ఇస్తారని అనుకున్నారు.
అలాగే రామ్ చరణ్, థమన్ తో కాస్త సన్నిహితంగా ఉండడంతో థమన్ కి సై రా ఛాన్స్ పక్కా అనుకున్నారు. కానీ రామ్ చరణ్ నే థమన్ కి సై రా అవకాశం ఇవ్వడం లేదని మొహం మీదే చెప్పేశాడట. కాకపోతే సై రా ఆవకాశం ఇవ్వలేకపోయినా బోయపాటి దర్శకత్వంలో తాను నటిస్తున్న సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఛాన్స్ ఇస్తానని చరణ్, థమన్ కి మాటిచ్చాడని అంటున్నారు. మరి చరణ్ ఎంతగా చెప్పినా థమన్ కి ఒక చారిత్రాత్మక చిత్రానికి సంగీతం అందించే ఛాన్స్ కోల్పోవడం కాస్త ఇబ్బందికర విషయమే.
ఎందుకంటే సైరా సినిమా జాతియా స్థాయిలో తెరకెక్కడంతో.. ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అంతా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతారు. పాపం థమన్ ఆ అవకాశాన్ని కోల్పోయినట్లే.