Advertisementt

పెద్దవారి పిల్లలందరూ దాదాపు క్లాస్‌మేట్సే!

Sat 09th Dec 2017 02:15 PM
sumanth,ys jagan,friendship,revealed  పెద్దవారి పిల్లలందరూ దాదాపు క్లాస్‌మేట్సే!
Hero Sumanth Talks about YS Jagan Mohan Reddy పెద్దవారి పిల్లలందరూ దాదాపు క్లాస్‌మేట్సే!
Advertisement
Ads by CJ

డబ్బునవారు, పేరున్న వారు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, సినిమా ఫ్యామిలీల నుంచి వచ్చిన వారి వారసులు, రాజకీయనాయకుల పిల్లలు అందరూ కోట్లాది రూపాయల ఫీజులుండే పేరుమోసిన కార్పొరేట్‌ స్కూల్స్‌, కాలేజీలు, విదేశాలలో చదువుల సమయంలో ఒకరికి ఒకరు దాదాపుగా క్లాస్‌మేట్స్‌గా ఉంటారు. వారేమి ఆషామాషీ వ్యక్తులు కాకపోవడంతో అలాంటి చోటే తమపిల్లలను చదివిస్తారు. అలా చెన్నైలో పెరిగిన వారు. హైదరాబాద్‌లో ఉన్నవారు కూడా చిన్ననాటి స్నేహితులుగా ఉండే ఉంటారు. వాటిని ఎప్పుడో సమయం, సందర్భం వచ్చినప్పుడు చెబుతారు. ఇక అక్కినేని ఫ్యామిలీకి చెందిన హీరో సుమంత్‌, వైసీపీ అధినేత, స్వర్గీయ వైఎస్‌రాజశేఖర్‌ కుమారుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ కూడా క్లాస్‌మేట్స్‌ మాత్రమే కాదు. మంచి స్నేహతులు కూడా అని తాజాగా సుమంత్‌ తెలిపాడు.

ఆయన మాట్లాడుతూ, మేమిద్దరం క్లాస్‌మేట్స్‌మి... మంచిస్నేహితులం. బాగా తిరుగుతూ అల్లరి చేసేవారం. ఇక ఒకరోజు నేను, జగన్‌ కలిసి డిన్నర్‌కి బయటకు వెళ్లాం. రాత్రి 12గంటల సమయంలో ఇంటికి వచ్చాం. తాళాలు మర్చిపోవడంతో నేను ఇంటిగోడను దూకుతానని చెప్పడంతో జగన్‌ నాకు సహాయం చేశాడు. కానీ జగన్‌ మాత్రం తాతయ్య ఏయన్నార్‌కి పట్టుబడిపోయాడు. తాత్తయ్య జగన్‌ని ఏమైనా అంటాడేమో అని భయమేసి నేను బాల్కనీని పట్టుకుని వేలాడుతూనే.. తాత్తయ్య.. తాత్తయ్య..జగన్‌.. రాజశేఖర్‌రెడ్డి గారి కుమారుడు అని చెప్పాను. అప్పటివరకు జగన్‌ రాజశేఖర్‌రెడ్డి కుమారుడని తాతయ్యకి తెలియదు.

దాంతో తాతయ్య కాస్త సీరియస్‌గానే 'నైస్‌ టు మీట్‌ యూ' అని జగన్‌కి చెప్పి వెళ్లిపోయాడు అని చెప్పుకొచ్చాడు.. ఇక జగన్‌తో పాటు రాజశేఖర్‌రెడ్డి, షర్మిలా, ఆమె భర్త బ్రదర్‌ అనిల్‌లు కూడా ప్రభాస్‌కి మంచిక్లోజ్‌. 'యోగి' చిత్రం ముందే వారికి మంచి పరిచయాలు ఉన్నాయి. ప్రభాస్‌ ప్రతి ఆదివారం హైదరాబాద్‌లోని ఓ చర్చికి వెళ్తాడు. అంతేకాదు.. 'బాహుబలి' ఏసు ఇచ్చిన గిఫ్ట్‌గా భావించి, ఆ చర్చికి మత ప్రచారం చేసుకునేందుకు ఏకంగా అత్యాధునికి వసతులు ఉన్న రెండు క్యారవాన్‌ వంటి ఖరీదైన వ్యాన్‌లను ఆ చర్చి పాస్టర్‌కి ఇచ్చాడట...!

Hero Sumanth Talks about YS Jagan Mohan Reddy:

Sumanth and YS Jagan Friendship Revealed

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ