అజ్ఞాతవాసి షూటింగ్ మూడు రోజుల క్రితమే పూర్తయ్యింది. అజ్ఞాతవాసి షూటింగ్ అలా పూర్తయ్యిందో లేదో ఇలా పవన్ కళ్యాణ్ తన రాజకీయ యాత్ర మొదలుపెట్టాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అజ్ఞాతవాసి సినిమా విడుదలకు ఒక నెల టైం మాత్రమే ఉంది. ఇలాంటి సమయంలో అజ్ఞాతవాసి చిత్ర బృందానికి పవన్ కళ్యాణ్ గట్టి షాక్ ఇచ్చాడు. అదేమిటి సినిమా పూర్తయ్యాక పవన్ అజ్ఞాతవాసి టీమ్ కి షాకివ్వడమేమిటి అనుకుంటున్నారా?
ఇంతకీ అసలు విషయం ఏమిటంటే అజ్ఞాతవాసి సినిమా ప్రమోషన్స్ లో పవన్ కళ్యాణ్ పాల్గొనలేడట. ఈ విషయాన్ని స్వయానా పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి ప్రొడ్యూసర్స్ కి చెప్పాడట. కేవలం రెండు రోజులు మాత్రం అజ్ఞాతవాసి డబ్బింగ్ కి డేట్స్ ఇస్తాడని.... ఆ తర్వాత మొత్తం పూర్తి బాధ్యత దర్శకుడు త్రివిక్రమ్ దే అని తెలుస్తుంది. మరి సినిమా విడుదలకు ముందు ఆడియో వేడుకలు, ప్రీరిలీజ్ వేడుకలు వంటివి కూడా ఏమి వద్దని పవన్ కళ్యాణ్ ప్రొడ్యూసర్స్ కు చెప్పాడని టాక్.
తాను పాలిటిక్స్ తో బిజీగా ఉంటాను కాబట్టి ప్రమోషన్ కి సమయం ఇవ్వలేనని నిర్మాత, దర్శకులకి పవన్ ముందే చెప్పాడట. మరి తెలుగులో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన అజ్ఞాతవాసి సినిమాకి కనీసం ఒక వేడుక అయినా చేయకపోతే ఎలా అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. అందుకే అజ్ఞాతవాసి పాటల వేడుక కూడా గ్రాండ్ గా జరిపించకుండా ఇలా ఒక్కొక్కటిగా పాటలను మార్కెట్ లోకి వదులుతున్నారంటున్నారు. ఇకపోతే ఎలాగైనా పవన్ ని కన్విన్స్ చేసి ఓ సాయంత్రం టైం తీసుకోగలిగితే ఏదైనా ప్రీ రిలీజ్ ఈవెంట్ లాంటిది చేసుకోవచ్చు అని చిత్ర బృందం ఆలోచన. మరి నిర్మాతల కోరిక మేరకు పవన్ కన్విన్స్ అయితే ఫ్యాన్స్ కి పండగే.. లేకుంటే.. లేదు.