వచ్చే ఏడాది సమ్మర్ కూల్ గా వుండే అవకాశముంది. ఎందుకంటే మార్చి 29న రెండు సినిమాలు విడుదల అవుతున్నాయి. ఒకటి 1970వ దశకం వరకు తెలుగు ప్రేక్షకులకు ముఖ్యంగా మహిళా ప్రేక్షకులకు అభిమాన నటి అయిన సావిత్రి జీవిత చరిత్ర మహానటి సినిమా. రెండోది 1980ల నాటి కాలమాన పరిస్థితుల నేపథ్యంలో సాగే చిత్రం రంగస్థలం 1985.
అయితే అందులో ఒకదానిని ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో తనకు మాంచి టాలెంట్ ఉందని నిరూపించుకున్న దర్శకుడు నాగ అశ్విన్ మహానటి సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడు. మరొకటి రామ్ చరణ్ హీరోగా సుకుమార్ రంగస్థలం సినిమా చేస్తున్నాడు.
ఈ రెండు సినిమాలు మార్చి 29న ఢీకొనబోతున్నాయి. సరిగ్గా పరీక్షల సీజన్ పూర్తయ్యే సరికి ఫ్యామిలీల కోసం ఈ రెండు సినిమాలు రిలీజ్ అవుతాయి. మొత్తానికి రాబోయే సమ్మర్ ఫ్రారంభంలో మంచి సినిమాలతో బోణీ అవుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.