అఖిల్ హలో కోసం అక్కినేని అభిమానులే కాదు... రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులతో పాటు.. ఓవర్సీస్ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నెల 22 న థియేటర్స్ లోకి రాబోతున్న హలో సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాపై అంతకంతకు మంచి హైప్ క్రియేట్ అవుతుంది. అక్కినేని నాగార్జున కూడా సినిమాపై కొద్ది కొద్దిగా అంచనాలు పెంచుతూ సినిమాకి బిగ్ ప్రమోషన్ ఇస్తున్నాడు. రెండో కొడుకు అఖిల్ ని ఈ సినిమాతో హీరోగా నిలబెట్టాలని నాగ్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాడు.
విక్రమ్ చేతిలో పెట్టినప్పటికీ అన్ని తానై ఈ సినిమా విషయంలో శ్రమిస్తున్నాడు. ఇకపోతే.. రొమాంటిక్, యాక్షన్ మూవీగా తెరకెక్కిన హలో సినిమాలోని అన్నిటికన్నా ఆ యాక్షన్ సన్నివేశాలే హైలెట్ అనేలా హలో ట్రైలర్ లో కనబడుతుంది. అలాగే ఈ సినిమాకి ఆ యాక్షన్ ఎపిసోడ్ అదరగొడుతుందట. అందుకోసం దర్శకుడు విక్రమ్ రొటీన్ కి భిన్నంగా ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 7.30వరకూ.. అంటే 12 గంటల్లో జరిగే కథే ఈ చిత్రం అంటున్నారు. కాకపోతే.... ఆయా సన్నివేశాల్లో ఫ్లాష్ బ్యాక్స్ రూపంలో మిగిలిన కథను చూపిస్తారని తెలుస్తుంది.
అయితే ఈ హలో సినిమాలో అఖిల్ చేసిన మూడు యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్ గా ఉంటాయని తెలుస్తోంది. ఆ యాక్షన్ పార్ట్ లో మొదటిది ఔటర్ రింగ్ రోడ్డుపై తీసిన ఓ ఛేజింగ్ సీన్ సూపర్బ్ గా ఉంటుందట. కార్లు.. వాటి మధ్య పరిగెత్తే మనుషులతో ఈ సీన్ సినిమా మొత్తానికి హైలైట్ గా నిలుస్తుందని తెలుస్తోంది. మరొకటి కృష్ణానగర్ లో బిల్డింగ్ ల పై నుంచి జంపింగ్స్ చేస్తూ సాగే మరో యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోతుందని అంటున్నారు. ఇకపోతే హలో సినిమాలో అఖిల్ ని చూస్తుంటే హాలీవుడ్ లో జాకీచాన్ గుర్తుకొస్తాడంటున్నారు. అలాగే మూడో యాక్షన్ పార్ట్ హైదరాబాద్ మెట్రో స్టార్ట్ అవకముందే మెట్రో ట్రైన్ లో తీసిన యాక్షన్ సన్నివేశాలు అయితే ఇంకా అదిరిపోతాయ్ అంటున్నారు. మొత్తానికి హలో ఫుల్ యాక్షన్ మూవీ అనేది దీన్ని బట్టే అర్ధమవుతుంది.