ఆమధ్య వెంకటేష్ మాట్లాడుతూ, సీనియర్ స్టార్స్‌కి హీరోయిన్లు కరువైపోతున్నారు. అలాగని నేటి హీరోయిన్లతో నటిస్తే చూసేందుకు, చేసేందుకు కూడా ఎబ్బెట్టుగా ఉంటుంది. దాంతో హీరోయిన్ల కొరత ఉంది అని చెప్పాడు. ఇక ఆయన చెప్పినట్లే 'బాబుబంగారం' చిత్రం విషయంలో హీరోయిన్ కోసం ఎంతో వెతుకులాడి చివరకు ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చి మరీ నయనతారని పెట్టుకున్నారు. ఆమె ప్రమోషన్స్‌కి నేను రాను అని చెప్పినా, ఎక్కువ పారితోషికం డిమాండ్ చేసినా కూడా ఆమెతోనే సర్దుకుపోయారు. ఇప్పుడు వెంకీ తేజ దర్శకత్వంలో 'ఆటా నాదే.. వేటా నాదే' అనే టైటిల్‌తో ఓ విభిన్నచిత్రం చేయడానికి ఒప్పుకున్నాడు. దాదాపు ఎప్పుడు తీసుకోని విధంగా ఎనిమిది నెలల గ్యాప్, ఎందరో దర్శకులు, ఎన్నో కథలు విన్నతర్వాత ఈ చిత్రం అయితే తన వయసుకి, ఇమేజ్‌కి సూటవుతుందని ఓకే చేశాడు.
ఇక తేజ దర్శకుడు కావడంతో 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రంలో తాను పరిచయం చేసిన హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటించింది కాబట్టి ఆమెనే ఒప్పించాలని చూశాడు. దాంతో పాటు తమన్నాపేరు కూడా వినిపించింది. కానీ వీరు వెంకటేష్ అనే సరికి సీనియర్ స్టార్ కాబట్టి మరో ఆప్షన్ లేక ఒప్పుకుంటారని భావించారు. కానీ వెంకీ-తేజలు మాత్రం ఈ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా చివరకు అనుష్కని ఎంపిక చేసుకున్నారని తెలుస్తోంది. ఇక అనుష్క 'సైజ్‌జీరో' సమయంలో బొద్దుగా మారినా రాజమౌళి 'బాహుబలి' కోసం, అశోక్, యువి క్రియేషన్స్ వారు 'భాగమతి' చిత్రాల విషయంలో రాజీపడి అనుష్క చేత పాత్రలు చేయించి, వాటిల్లో అనుష్కను నాజూకుగా చూపేందుకు గ్రాఫిక్స్, విఎఫ్‌ఎక్స్‌ల కోసం ఏకంగా ఒక మీడియం రేంజ్ సినిమాకి పెట్టినంత బడ్జెట్‌ని పెట్టారు.
కానీ ఇటీవలే ఈమె నాజూకుగా మారి తన ఫొటోలను సోషల్‌మీడియాలో పెట్టింది. కాబట్టి ఇంతకు ముందు తనతో 'చింతకాయల రవి, నాగవల్లి' చేసిన అనుష్కకే వెంకీ కూడా ఫైనల్ ఓటు వేశాడని తెలుస్తోంది.