Advertisementt

బాలయ్యో.. నీ స్పీడ్ ఏందయ్యో..?

Fri 08th Dec 2017 04:06 PM
balakrishna,young heroes,104 movie  బాలయ్యో.. నీ స్పీడ్ ఏందయ్యో..?
Balakrishna 104 Movie Confirmed బాలయ్యో.. నీ స్పీడ్ ఏందయ్యో..?
Advertisement
Ads by CJ

బాలయ్యకి వయసొస్తున్న కొద్దీ ఊపోస్తున్నట్టుగా కనబడుతుంది. ఎందుకంటే గత ఏడాది నుండి బాలకృష్ణ సినిమాల్లో యమా జోరు చూపిస్తున్నాడు. 99 వ చిత్రం దగ్గరనుండి ఎటువంటి గ్యాప్ ఇవ్వకుండా బాలకృష్ణ సినిమాలను లైన్ లో పెడుతూ పిచ్చెక్కిస్తున్నాడు. 99 వ సినిమానుండే బాలయ్య జోరు పెరిగింది. డిక్టేటర్, గౌతమీపుత్ర శాతకర్ణి, పైసా వసూల్ వంటి చిత్రాలను వరసబెట్టి ప్రేక్షకులకు అందించిన బాలకృష్ణ ఇప్పుడు రవికుమార్ దర్శకత్వంలో జై సింహని థియేటర్స్ లోకి   దింపెయ్యడానికి రెడీగా ఉన్నాడు. జై సింహ షూటింగ్ రెండు రోజుల క్రితమే పూర్తయ్యింది. 

ఇక జై సింహ ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొంటూనే బాలకృష్ణ తన తదుపరి చిత్రాన్ని కూడా పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. 103 వ చిత్రాన్ని ఎన్టీఆర్ బయోపిక్ గా తీస్తానని ప్రకటించిన బాలకృష్ణ ప్రస్తుతానికి దాన్ని పక్కన పెట్టి... సీనియర్ దర్శకుడు ఎస్ వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో తన 103 వ చిత్రాన్ని చెయ్యబోతున్నాడు. జనవరి నుంచి ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో బాలకృష్ణ తన కొత్త చిత్రాన్ని మొదలుపెడతాడని తెలుస్తోంది. ఎస్ వి కృష్ణారెడ్డి యమలీల.. ఘటోత్కచుడు తరహాలో మరోసారి ఫ్యాంటసీ సబ్జెక్టును తీసుకుని బాలకృష్ణను కలవగా.. ఆయన చెప్పిన సబ్జెక్టు బాలయ్యను ఆకట్టుకుందని తెలుస్తోంది. జనవరి నుంచి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించేద్దామని చెప్పినట్లుగా వార్తలొస్తున్నాయి.

అంటే జై సింహ అలా విడుదలవుతుందో లేదో.. నెల రోజుల గ్యాప్ లోనే బాలకృష్ణ మరో సినిమా మొదలుపెట్టేస్తుండడం విశేషం. మరోపక్క 104 వ సినిమాని బోయపాటికి కమిట్ అయినట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఇదంతా చూస్తుంటే బాలయ్య బాబుని చూసిన కుర్ర హీరోలకు దడ పుట్టడం ఖాయంగా కనబడుతుంది. ఎందుకంటే బాలకృష్ణ లాగ కుర్ర హీరోలెవరు సినిమాల మీద సినిమాలు చెయ్యడం లేదు. అందుకని బాలయ్య స్పీడు కి కుర్రాళ్లకు  దడదడే.

Balakrishna 104 Movie Confirmed:

Balakrishna Shocks Young Heroes with Movies

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ