Advertisementt

ఊహించని కాంబినేషన్ లో బన్నీ మూవీ!

Fri 08th Dec 2017 01:35 PM
allu arjun,santosh reddy,director,naa peru surya naa illu india  ఊహించని కాంబినేషన్ లో బన్నీ మూవీ!
Allu Arjun to Work with a Debut Director? ఊహించని కాంబినేషన్ లో బన్నీ మూవీ!
Advertisement
Ads by CJ

స్టార్ ఇమేజ్ వున్నా హీరోస్ కొత్త దర్శకులతో పని చేయటానికి అంతగా ఆసక్తి చూపించరు. పెద్ద దర్శకులతో గాని, స్టార్ దర్శకులతో గాని చేయటానికి ఇష్టపడుతుంటారు హీరోస్. కానీ బన్నీ వీటినన్నింటిని తిప్పి కొడుతూ.. ఓ కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇచ్చాడు. రైటర్ గా పేరు తెచ్చుకున్న వక్కంతం వంశీకి డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చాడు బన్నీ. ప్రస్తుతం వీళ్ల కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం తుది దశకు చేరుకుంది. ఈ సినిమాకు ఓపెనింగ్ రోజే నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా అనే టైటిల్ కూడా పెట్టారు.

ఇది ఇలా ఉండగా బన్నీ తన నెక్స్ట్ మూవీ కోసం ఇంకో కొత్త దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సంతోష్ రెడ్డి చెప్పిన కథకు బన్నీ బాగా ఇంప్రెస్స్ అయ్యి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. కేవలం ఒకే సిట్టింగ్ లోనే సినిమా తెరకెక్కించేందుకు కూడా యాక్సెప్ట్ చేసేశాడట అల్లు అర్జున్. స్క్రిప్ట్ కూడా దాదాపుగా ప్రిపేర్డ్ గా ఉండడంతో.. వీలైనంత త్వరగా షూటింగ్ మొదలుపెడదామని బన్నీ సంతోష్ రెడ్డికి చెప్పినట్లుగా తెలుస్తోంది.

అయితే ఈ సినిమా నా పేరు సూర్య తర్వాత మొదలయ్యే అవకాశముంది. సంతోష్ రెడ్డి యూవీ క్రియేషన్స్ కి సన్నిహితుడు. మరి బన్నీ యూవీ క్రియేషన్స్ కి ఛాన్స్ ఇస్తాడో.. లేదో.. ఇంకా తెలియాల్సివుంది. వరసబెట్టి ఇద్దరు కొత్త దర్శకులకి అవకాశం ఇచ్చిన బన్నీకి ఇది సాహసమే అని చెప్పాలి. కానీ సబ్జెక్టుపై పూర్తి కాన్ఫిడెన్స్ ఉండడంతోనే బన్నీ, సంతోష్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్నది టాక్. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Allu Arjun to Work with a Debut Director?:

Allu Arjun to Team up with a Debut Director Santosh Reddy?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ